Monday, 16 November 2026

వార్తలు

సూర్యనారాయణస్వామిని తానికి ఆదిత్యుని కిరణాలు

శ్రీకాకుళం : అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను ఆదిత్యుని లేలేత కిరాణాలు ఈ ఉదయం స్పృశించాయి. స్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు తాకిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప సుందర దృశ్యం వీక్షించేందుకు భక్తులు…

పోలవరం ప్రాజెక్టు పనులకు భూమిపూజ

దేవునిపట్నం : పోలవరం ప్రాజెక్టు పనులకు గుత్తేదారు ఈ ఉదయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవునిపట్నం మండలం అంగులూరు కొండవద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌కో సీఎండీ హామీ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలకు నిరసనగా తెరాస ఎమ్మెల్యేల బృందం నేడు ట్రాన్స్‌కో సీఎండీని కలిసింది. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌కో సీఎండీ హామీ పత్రం ఇచ్చారు. తెలంగాణ ఫీడర్లకు వంద మెగావాట్ల…

జీవో నెం 120ని రద్దుచేయాలి

బాగ్‌లింగంపల్లి : కొల్లేరు ప్రాంత ప్రజల జీవనోపాధిని దెబ్బదీసే జీవో నెం 120 చిత్తడి నేలల పరిధి, ఎకోజోన్‌ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంగళ సుబ్బారావు, ఏపీ మత్స్యకారుల సంఘం జయ…

సచివాలయంలో ఆక్టోపన్‌ తనిఖీలు

హైదరాబాద్‌: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సచివాలయంలో ఆక్టోపన్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రెండు రోజులుగా జంటనగరాల్లోని కీలక ప్రాంతాలన్నీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే.

గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు వినిపించిన ఈడీ

న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలి జనార్థన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈడీ తన వాదనలు వినిపించింది. బ్రాహ్మణి ఇండస్ట్రీన్‌కు అనుమతులు వచ్చేలా శ్రీలక్ష్మి వ్యవహరించారని, ఓఎంసీకి లీజులు వచ్చేలా రాజగోపాల్‌ వ్యవహరించారని ఈడీ…

అబిడ్స్‌ బిగ్‌బజార్‌ను మూసివేయించిన పోలీసులు

హైదరాబాద్‌: భద్రతా చర్యలు పాటించని వాణిజ్య సముదాయాలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు అబిడ్స్‌లోని బిగ్‌బజార్‌ను పరిశీలించిన పోలీసులు భద్రతా నియమాలు పాటించడం లేదంటూ దానిని మూసివేయించారు.

ఏరోమాట్రిక్స్‌ మాజీ సభ్యుడిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు మాజీ అధికారులను విచారిస్తోంది. దీనిలో భాగంగా ఏరోమాట్రిక్స్‌ బోర్డు మాజీ సభ్యుడు గౌతమ్‌ ఖైతాన్‌ను ఈరోజు సీబీఐ ప్రశ్నించింది.

ఐఏఎన్‌ అధికారుల బదిలీకి ప్రభుత్వ కసరత్తు?

హైదరాబాద్‌: ఐఏఎన్‌ అధికారుల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగా రాష్ట్రంలోని ఏడెనిమిది జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది