Monday, 16 November 2026

వార్తలు

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,860, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 550గా ఉంది. కిలో వెండి ధర…

మావోయిస్టుల పేరుతో పోస్టర్లు

నల్గొండ : నల్గొండ జిల్లా చందాన్‌పేట మండలం ఛిత్రియాల గ్రామాంలో నైట్‌ హాల్ట్‌ బస్సుకు మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లు అంటించారు. కృష్ణ పత్తి ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం చేస్తున్న పరిశోధనను ఆపాలని, పోలీసులు ఆప్రాంతంలో తిరగరాదని…

విద్యుత్‌ సమస్యలపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. గ్రామాలకు నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆయన హెచ్‌ఆర్సీకి విన్నవిరచారు. మార్చి 20 లోగా సమగ్ర నివేదిక…

తాగునీటీ సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాగు నీటి సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం క్యాంపు కార్యాలయంలో జరుగుతోంది. ఇప్పటికే నీటి ఎద్దడితో ప్రజల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వేసవి రాక ముందే…

గ్రూప్‌-1 ఇంటర్య్వూ ఫలితాలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: గ్రూప్‌ -1 ఇంటర్య్వూ ఫలితాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కీ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకూ ఫలితాలు నిలిపివేయాలని కోర్టు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.

సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కొత్తగూడెం సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌, టీబీజీకేన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, జేఏసీ నేతలు…

ఎక్స్‌గ్రేషియాలోనూ వివక్షేనా : హరీష్‌రావు

హైదరాబాద్‌: ఎక్స్‌గ్రేషియాతో కూడా సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు ఆరోపించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం, సింగరేణి…

రుణాల మాఫీలో అవకతవకలు జరగలేదు : పవార్‌

న్యూఢిల్లీ  :పంట రుణాల మాఫీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీ అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రుణాల మాఫీపై కాగ్‌ నుంచి సమగ్ర…

పంజాబ్‌,బీహర్‌ ఘటనలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ : పంజాబ్‌లో మహిళపై పోలీసుల దాడి, బీహార్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ ఘటనలను సుప్రీం కోర్టు సుమోగోగా స్వీకరించింది. ఈ ఘటనలపై ఈ నెల 11 లోగా వివరణ ఇవ్వాలని పంజాబ్‌, బీహార్‌ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వేలకోట్లు నిధులు దుర్వినియోగం జరిగిందని ఆయన ధ్వజమొత్తారు. కుంభకోణాలతో కాంగ్రెస్‌ పార్టీ కోట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఖాతాలో మరో అతిపెద్ద కుంభకోణం పోలవరం…