Monday, 16 November 2026

వార్తలు

బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 18 లక్షలు స్వాధీనం

కడప: ఎలాంటి లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ. 18 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా  ప్రొద్దుటూరులో అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.

ఈ సారి కప్‌ సొంతం చేసుకుంటాం : రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: సీసీఎల్‌ పోటీలను భాగా ఆస్వాదిస్తున్నామని సీనీ నటుడురామ్‌చరణ్‌ అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్‌ మీడియాతో ముచ్చటించారు. జట్టులోని సభ్యులంతా సమష్టింగా రాణిస్తున్నారని. ఈ సారి కచ్చితంగా కప్‌సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం 7…

నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలి : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెరాస నేత హరీశ్‌రావు కోరారు.ప్రత్యేక అధికారుల్ని నియమించి పంటనష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయిన రైతులను…

నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా హరిధాస్‌

హైదరాబాద్‌: పచ్చదనం,పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పీ3పీ సంస్థ నెక్లెస్‌ రోడ్‌లో పరుగు నిర్వహించింది. హరిధాస్‌ పేరుతో నిర్వహించిన ఈ పరుగును మంత్రిదానం నాగేందర్‌ ప్రారంభించారు. విద్యార్థులు, యువత ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గోన్నారు. ప్రకృతిపై అవగాహన…

రాజమండ్రి బయలుదేరిన సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజమండ్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో గల్ఫ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన బాధితులను నేతలు పరామర్శించారు.

పాక్‌లోని క్వెట్టాలో బాంబు పేలుడు.. 63 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతం మరోసారి రక్తమోడింది. షియా వర్గం లక్ష్యంగా ముష్కరులు శక్తివంతమైన బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 63 మంది మృత్యువాతపడ్డారు.200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. హజరా పట్టణానికి…

బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి

విశాఖ : మల్కాపురంలో షిప్‌యార్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

గల్ఫ్‌ బాధితులను దశలవారిగా తీసుకువస్తాం : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన గల్ఫ్‌ బాధితులను దశలవారిగా హైదరాబాద్‌కు చేరుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వీసా గడువు ముగిసిపోయి దుబాయి జైళ్లలో మగ్గుతున్న బాధితులను సైతం విడిపించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వెల్లడించారు.…

నేడు మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌

ముంబయి: మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీన్‌ జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. ఫైనల్లో గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా చూస్తుండగా… ఈ టోర్నీలో అందరి కంటే ఎక్కువ పాయింట్లతో ముందంజలో…

నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం

న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్‌ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ అధికారుల సంయుక్తబృందం ఆదివారం ఇటలీకి వెళ్లనుంది. ఈ వ్యవహారంపై ఇటలీలోనూ…