Monday, 16 November 2026

వార్తలు

ఓఎంసీ, జగన్‌ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్‌ రెడ్డిలకు ఫిబ్రవరు 14 వరకు…

సహకార ఎన్నికల్లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్ధితులు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సహకార ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో తమ ఓట్లను వేరేవాళ్లు వేశారని మదనపల్లెలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు.…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,880గా ఉంది. 22 క్యార్లె 10 గ్రాముల బంగారం ధర రూ. 29,200గా ఉంది. కిలో వెండి ధర రూ.…

సుప్రీంకోర్టుకు వెళ్లను : కమల్‌హాసన్‌

చెన్నై : మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనని ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ‘ విశ్వరూపం’ సినిమా వివాదం నేపధ్యంలో చిత్ర విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తానని కమల్‌ నిన్న ప్రకటించారు.…

ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుకు హాజరు కాకపోవడంపై తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు  ఎనిసార్లు హాజరయ్యారని ఆయన…

పాక్‌ ఆరోపణలను ఖండించిన భారత్‌

ఢిల్లీ : భారత సైన్యం గతంలో తమ సైనికుల తలలు నరికిందన్న పాకిస్థాన్‌ ఆరోపణలను భారత రక్షణ మంత్రి ఎ. కె ఆంటోనీ ఖండించారు. పాక్‌ వాదన పూర్తిగా నిరాధారమని కేంద్రం పేర్కొంది.

కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు సీబీఐ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణకు ఆయన న్యాయస్థానానికి రావలసి వచ్చింది.

ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సు ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు ఉదయం ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సును ప్రారంభించారు.  ఈసందర్శంగా ఆయన  మాట్లాడుతూ ఆర్ధిక సంస్కరణల ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. అంతర్జాయతీంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వృద్ధి సాధించాల్సిన అవశ్యకత ఉందని…

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కూరు సహకార సంఘం ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఓటర్లను ఓటు వేయకుండా ఆపేస్తున్నారంటూ తెదేపా మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ…

నేడు కేకే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలంటూ రాజీనామా అస్త్రాలతో అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకువస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ కేకే నివాసంలో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు…