Monday, 16 November 2026

వార్తలు

పంటపొలంలోనే పత్తిరైతు ఆత్మహత్య

హసన్‌పర్తి : వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ గ్రామంలో చల్ల కుమారస్వామి (42) అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీరు లేక మూడు ఎకరాల పత్తి ఎండిపోవడంతో పంట చేనులోనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు.…

తెలంగాణ అనుకూల పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తాం : నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణకు మద్దతుగా ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ చేపట్టనున్న సామూహిక ధర్నా పోస్టర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. భాజపా, వైకాపా మినహా తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామని…

బోసిపోయిన హైదరాబాద్‌ రహదారులు

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ రహదారులు బోసిపోతున్నాయి. సంక్రాంతి కోసం కుటుంబసమేతంగా పల్లెబాట పట్టడంతో నగరంలో సందడి తగ్గింది. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్‌, హిమయత్‌నగర్‌, బేటంపేట, సికింద్రాబాద్‌…

కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలు

ఖమ్మం: ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నిమ్మలగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.

మహిళపై ఇద్దరు యువకుల ఆత్యాచారం

హైదరాబాద్‌: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు ఆగడం లేదు. ఇద్దరు యువకులు తనపై అత్యాచారం చేసినట్లు నగరంలోని అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు యువకులపై కేసు నమోదు…

ప్రధాని సంక్రాంతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు సంపద, సంతోషాలను తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. రైతులకు ఇది ప్రధానమైన పండుగని.. వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలియజేస్తొందని ఒక ప్రకటనలో తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధిలో…

నగరంలో వేడుకగా భోగి మంటలు

హైదరాబాద్‌: నగరంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ వేకువజామునే ప్రజలు భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. ఖైరతాబాద్‌, ఆనంద్‌నగర్‌, పద్మారావునగర్‌లో కట్టెలు, పాతవస్తువులు కుప్పగా పోసి భోగి మంటలు వేశారు. యువతీయువకులు, చిన్నాలు, పెద్దలు అంతా భోగి…

వైద్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం: వైద్య కళాశాల విద్యార్థిని  ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. రాజోలు జేమ్స్‌ వైద్య కళాశాలలో చదువుతున్న  విద్యార్థిని ఐశ్వర్యసాయి ఈ తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న…

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పక్కపట్లవారిపాలెంలో ఈ ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

భోగి మంటలు అంటుకుని ముగ్గురికి తీవ్రగాయాలు

బిక్కవోలు : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం వందలపాకలో సంక్రాంతి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఉదయం భోగి మంటలు వేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురికి మంటలు  అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో…