Sunday, 15 November 2026

వార్తలు

మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ పూర్తిపేరు ఇంద్రకరణ్‌ గుజ్రాల్‌ రష్యాలో భారత రాయభారీగా పనిచేసిన గుజ్రాల్‌,…

మోడీపై పోలీస్‌ అధికారి భార్య పోటీ

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా సస్పెండైన ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌భట్‌ భార్య శ్వేతను పార్టీ బరిలోకి దింపింది. మోడీ పోటీ చేస్తున్న మణీనగర్‌ నుంచి శ్వేత నేడు పార్టీ తరపున…

నాంపల్లిలో ఐదుగురు వ్యక్తుల అరెస్ట్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని అక్రమంగా వసూళ్లు చేపట్టిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృస్టించింది. ప్రభుత్వం మోసపోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అక్రమార్కుల బారినపడి  మోసపోతూనే ఉన్నారు.

గుంటూరులో విత్తన విత్తన విక్రయకేంద్రాలపై దాడులు

గుంటూరు : జిల్లాలోని చేబ్రోలులో మొక్కజొన్న విత్తనవిక్రయ కేంద్రాలపై వ్యవసాయశాఖ అధికారులు దాడిచేశారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న రూ. 5 లక్షల విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బిల్లులో ఎలాంటి స్పష్టత లేదు : గాలి ముద్దుకృష్ణమనాయుడు

హైదరాబాద్‌ : ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక అమలుకు ప్రవేశపెట్టిన బిల్లులో ఎలాంటి కొత్తదనం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులు వైఎస్‌ హయాంలోనే పక్కదారి పట్టాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం…

వంశధార జలాలపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : వంశధార జలాలపై ఆంధ్రప్రదేశ్‌ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నాలుగువారాల పాటు వాయిదా వేసింది. వంశధారపై 2010 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌ వేసింది.

ఎవరితోనూ పొత్తులుండవు

బెంగుళూరు : కర్ణాటక విధానసభకు జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇకపై భాజపా నేతలతో అనవసరంగా మాట్లాడబోనని ఆయన తెలిపారు. డిసెంబర& 9న కర్ణాటక జనతాపార్టీ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు…

కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఆగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌ విఫలం కావడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

వైసీపీ నేత షర్మిలపై పయ్యావుల ఫైర్‌

హైదరాబాద్‌: టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీడీపీ పయ్యావుల కేశవ్‌ ఫైర్‌ అయ్యారు. షర్మిల పాదయాత్ర చంద్రబాబు టార్గెట్‌గా చేస్తున్న యాత్రగా ఉందని ఆయన విమర్శించారు. ” రాజన్న కూతర్ని, జగనన్న చెల్లెవ్ని” అని ఊరూరా…

విద్యుత్‌ వాడకాన్ని ప్రజలు తగ్గించుకోవాలి : సీఎం

హైదరాబాద్‌ : విద్యుత్‌ బిల్లులు తగ్గాలంటే ప్రజలు వినియోగం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సర్‌చార్జీలను విధించడంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్రంలో జలవిద్యుత్‌…