Sunday, 15 November 2026

వార్తలు

చట్టబద్ధతతోపాటు నిబద్ధత అవసరం : హరీష్‌రావు

హైదరాబాద్‌ : ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్‌రావు అన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో…

రానున్న కాలం నానో టెక్నాలజీదే

  హైదరాబాద్‌: రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్యతతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం అన్నారు. ఆశయాలను వాస్తవంలోకి…

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ను తయారు చేయాలని కేసీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ,…

గుజ్రాల్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని గుజ్రాల్‌ మృతిపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన సంతాప సందేశాన్ని గుజ్రాల్‌ కుమారుడు నరేష్‌కు పంపించారు. గుజ్రాల్‌ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.…

గుజ్రాల్‌ మృతికి సంతాపంగా పార్లమెంటు వాయిదా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ మృతికి సంతాప సూచకంగా పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని గుజ్రాల్‌ కన్నుమూసినట్టు కేంద్రహోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రకటించారు.

డిసెంబరు 22న ఆర్టీసీ ఎన్నికలు

హైదరాబాద్‌: డిసెంబరు 22న ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలతో కార్మికశాఖ కమిషనర్‌ జరిపిన చర్చల్లో కార్మికసంఘం ఎన్నిలు జరపాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌యూనియన్‌కుబాణం గుర్తుకేటాయించారు.

మార్కెట్‌లో కొనసాగిన ర్యాలీ

ముంబయి: శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో భారతీయస్టాక్‌ మార్కెట్‌లో లాభాల్లోకి దూసుకుపోయింది. సెన్సెక్స్‌ 168.99 పాయింట్ల ఆధిక్యంతో 19339.90 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 54.85 పాయింట్ల లాభంతో 5879.85 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని వాహన రంగానికి చెందిన షేర్లు…

విజయమ్మపై క్రిస్టియన్‌ సంఘాల ఫైర్‌

హైదరాబాద్‌: వైఎస్‌ విజయలక్ష్మీపై క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. పవిత్రమైన బైబిల్‌ను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని సూచించారు. అలాగే క్రైస్తవ మత ఆచారాలను సైతం విజయమ్మ పాటించట్లేదని అన్నారు. వాస్తవానికి తమ ఆచారం ప్రకారం మహిళలు బొట్టు…

వరంగల్‌లో ఏసీబీ వలలో అవినీతి చేప

  వరంగల్‌: ఓ అవినీతి చేప అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కింది. జిల్లా కలెక్టరేట్‌లో ఓ హాస్టల్‌ వార్డెన్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా డీఎస్‌డబ్య్లూవో ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం: తెలంగాణ ఎమ్మార్సీఎస్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును విమర్శిస్తే సహించబోమని తెలంగాణ ఎమ్మార్సీఎస్‌ హెచ్చరించింది. తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ నేత భిక్షపతి మాదిగ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఉద్యమనేత కేసీఆర్‌ను సీమాంధ్ర నేతలు విమర్శిస్తే చూస్తు కూర్మోమని అన్నారు. గత…