Saturday, 14 November 2026

వార్తలు

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు బులియన్‌  మార్కెట్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 32,100, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,350,…

పార్టీలోనే కొనసాగుతా: పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. తన నియోజవర్గంలోని ప్రతి పనికి సీఎం అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నీ అధిష్ఠానానికి వివరించానన్నారు.…

ఎఫ్‌డీఐలపై చర్చకు అనుమతినిచ్చిన స్పీకర్‌

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చించేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అనుమతినిచ్చారు. 184వ నిబంధన కింది చర్చకు అనుమతిస్తున్నట్లు సభలో ప్రకటించారు. చర్చకు తేదీ, సమయం తర్వాత ప్రకటిస్తామని తెలియజేశారు. ఎఫ్‌డీఐలపై చర్చకు స్పీకర్‌ అనుమతినివ్వడాన్ని భాజపా స్వాగగతించింది.

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

తమిళనాడులో కంపించిన భూమి

చెన్నై : తమిళనాడులోని సేలం, ధర్మపుని జిల్లాల్లో ఈ రోజు భూమి స్వల్పంగా కంపించింది. వీటి తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.3గా నమోదైంది. భూప్రకంనలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

లోక్‌సభ స్పీకర్‌తో సుష్మాస్వరాజ్‌ భేటీ

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌తో బీజేసీ  సభావక్ష నేత సుష్మాస్వరాజ్‌ ఈరోజు భేటీ అయ్యారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తేనే సభ సజావుగా సాగుతుందని సుష్మాస్వరాజ్‌ స్పీకర్‌కు తేల్చిచెప్పారు.

ఏసీబీ కోర్టుకు గాలి తరలింపు

హైదరాబాద్‌: బెయిల్‌ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు  ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

మణుగూరు రైల్వేస్టేషన్‌లో సైకో వీరంగం

మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడుజ రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఉన్న మూడు ఆటోలను ధ్వంస చేశాడు. స్టేషన్‌లో రైలు కోసం వేచివున్న ప్రయాణికులపై రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో…

సహాయ గణాంకాధికారి (ఏఎస్‌వో) ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: సహాయ గణాంకాధికారి (ఏఎన్‌వో) ఫలితాలను ఏపీపీఎస్సీ ఈరోజు ఉదయం విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి డిసెంబరు 6 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని అధికారులు తెలియజేశారు.

అక్రమంగా నిల్వచేసిన మద్యం స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్‌లోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వచేసిన రూ.15 లక్షలు విలువచేసే 508 కాటన్‌ల లిక్కర్‌ను అధికారులు గుర్తించారు. అక్రమంగా నిల్వచేసిన వారు పరారు కాగా,…