Saturday, 14 November 2026

వార్తలు

నేడు ఎఫ్‌ఢీఐలపై అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు కేంద్ర అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటింపజేస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని మన్మోహన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌  తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 131 పరుగుల వద్ద జహీర్‌ ఖాన్‌ (1) పనేసర్‌ బౌలింగ్‌లో ప్రయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగుల…

భాజపా నుంచి జెఠ్మలానీ వెలి

  ఢిల్లీ: భాజపా సీనియర్‌నేత, ఆ పార్టీ ఎంపీ రాం జఠ్మలానీపై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గడ్కరీ నాయకత్వంతో పాటు సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై పార్టీ వైఖరిని జెఠ్మలనీ ప్రశ్నించటం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు దారి తీసింది.…

గజదొంగల రాజ్యం వద్దు ఆంధ్రపార్టీలను తరమికొట్టాలి సమరభేరి సభలో కేసీఆర్‌

మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నపుడు ఎందుకు మాట్లాడలేదు సమైక్యాంధ్ర పార్టీలకు కోదండరామ్‌ సూటి ప్రశ్న సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు రాజన్న, చంద్రన్నలాంటి గజదొంగల రాజ్యం వద్దని తెలంగాణ రాజ్యమే కావాలని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…

తమిళనాడులో బస్సు లోయలోపడి ఆరుగురు మృతి

చెన్నై : తమిళనాడులో కోయంబత్తూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్పారాయై వద్ద ఘాట్‌ రోడ్డులో బస్సు లోయపడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కోయంబత్తూర్‌, పొల్చాచ్చిలోని  ఆస్పత్రులకు తరలించారు.

సామ్రాజ్యవాదుల దోపిడీని ఆరికట్టాలి

హైదరాబాద్‌: సామ్రాజ్యవాదులు దేశాలను రెచ్చగొడుతూ దేశాల మధ్య చిచ్చుపెడుతూ అణుయుద్దాలతో భూతలాన్ని నాశనం చేస్తున్నారని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సామ్రాజ్యవాదులు చేసే వనరుల దోపిడీకి, దేశాల మధ్య అసమానతలు రూపుమాపడానికి ప్రతి…

ప్రస్తుతానికి నేను శాసనసభ్యుడిని మాత్రమే : మంత్రి ధర్మాన

విశాఖపట్నం: ప్రస్తుతానికి తాను శాసనసభ్యుడిని మాత్రమేనని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాల్లో ఆయనతోపాటు జిల్లా మంత్రులు, శాసనసభ్యులు పాల్గోన్నారు. తాము ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజలకు మాత్రం నష్టం జరగనివ్వడం…

గవర్నర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విచారణ వద్దంటూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.

బీఎస్‌ఈదే ప్రపంచంలో ప్రథమస్థానం

ముంబయి: ప్రపంచ స్టాక్‌ ఎక్సేంజిల్లో టాప్‌ ఎక్సేంజ్‌గా నిలిచింది బోంబే స్టాక్‌ ఎక్చ్సేంజ్‌. లిస్టెడ్‌ కంపెనీల సంఖ్య అత్యధికంగా కలిగిన బీఎస్‌ఈ న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజిని,నాన్‌డాక్‌ని, లండన్‌ స్టాక్‌ ఎక్సేంజిని పక్కకునెట్టి ప్రధమ స్థానం సంపాదించింది. బీఎస్‌ఈలో 5,174…

413 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆటౌట్‌

ముంబయి: ముంబయి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 413 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓజా 5, హర్బజన్‌ 2,అశ్విస్‌ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 86 పరుగలు ఆధిక్యం లభించింది.