Tuesday, 17 November 2026

తెలంగాణ

ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు

యాదాద్రి,అగస్టు12(జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిప్పురవ్వలు ఎగిసిపడి…

గెల్లుపై ఈటెల రాజేందర్‌ విమర్శలు అర్థరహితం

మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

హుజరాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలు

మహిళా సమాఖ్య భవనానికి మంత్రి హరీష్‌ శంకుస్థాపన హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): హుజరాబాద్‌లోనే మకాం వేసిన మంత్రి హరీష్‌ రావు ఇక్కడ వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హుజూరాబాద్‌…

దళితబంధు సభా వేదిక ఏర్పాట్ల పరిశీలన

16న జరిగే సభాప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు లక్షా 20వేల మందితో దళితబంధు సభ నిర్వహణ దళితప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు కెసిఆర్‌ చేతుల విూదుగా 2వేల మందికి చెక్కుల పంపిణీ వివరాలు వెల్లడిరచిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హుజూరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర…

ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణం

ప్రమాణం చేయించిన స్పీకర్‌ పోచారం హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): నాగార్జునసార్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్‌ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఆయన సభ్యుడిగా ప్రమాణం చేయాల్సి ఉన్నా వివిధ…

జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం మంచిర్యాల,ఆగస్ట్‌12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా లేకున్నా, జిల్లాలో కేసులు నమోదవు తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా…

పర్యాటక ప్రాంతంగా పోచారంను అభివృద్ది చేయాలి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సురేందర్‌ అంగీకరించిన మంత్రి కిషన్‌ రెడ్డి నిజామాబాద్‌,ఆగస్ట్‌12(జనం సాక్షి): సహజ సిద్ధమైన పకృతి అందాలు కలిగిన పోచారం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు సహకరించాలనికేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డిని…

మభ్యపెట్టే మాటలు, పథకాలు మానాలి

ప్రజలకు మేలు చేయకుంటే వాతలు పెడతారు పిసిసి చీఫ్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఎలా కాంగ్రెస్‌ దండోరాతో అధికార పార్టీలో వణుకు : షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఆగస్ట్‌12(జనం సాక్షి): కాంగ్రెస్‌ హయాంలోనే దళిత, గిరిజనులకు న్యాయం జరిగిందని మాజీమంత్రి,…

పాదయాత్రలో ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు

పెట్రో ధరలు, గ్యాస్‌ బాదుడు వంటి సమస్యలపై విశదీకరిస్తారా నిరుద్యోగ సమస్యలపై మోడీ ఇచ్చిన హావిూలకు సమాధానం ఇవ్వగలరా బిజెపి అధ్యక్షుడు బండి పాదయాత్రకు ముందు సమాధానాలు వెతుక్కోవాలి హైదరాబాద్‌,ఆగస్ట్‌12(జనం సాక్షి): తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు…

హుజురాబాద్‌ బరిలో గెల్లుశ్రీనివాస్‌ యాదవ్‌

` ఉద్యమకారునికే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ` శుభాకాంక్షలు తెలిపిన తెరాస నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి):హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి…