Monday, 9 November 2026

తెలంగాణ

బాసర ఐఐఐటీ వీసీపై చర్యలు తీసుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అధ్యాపకులకు ఉద్యోగాలు ఇవ్వడంపై వివక్ష పాటిస్తున్న బాసర ఐఐఐటీ వీసీపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు, పీబీ మెంబర్‌ డి.శ్రావణ్‌ కుమార్‌ డిప్యూటీ సీఎంను కోరారు. ఈ మేరకు వారు డిప్యూటీ సీఎం దామోదర…

జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజేంద్ర నగర్‌ స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డుకున్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను వాగ్వాదానికి దిగారు.

సీమాంధ్ర ఉద్యమం కృత్రిమమే : కోదండరాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం కృత్రిమ ఉద్యమమేనని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం విమర్శించారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలను ఎక్కువ చేసి ప్రసారం చేస్తున్న సీమాంధ్ర చానళ్లపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేయూలో విద్యార్థి సంఘాల నిరవధిక దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): వరంగల్‌ కాకతీయ యూనివర్సీటీలో మెన్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు నిరవధిక దీక్ష చేపట్టాయి. విద్యార్థులు ఉప కులపతి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు.

సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు కేంద్రమంత్రి ఆంటోనితో సీఎం సమావేశం కానున్నట్లు సమాచారం.

ప్రధానితో సమావేశమయిన తెలంగాణ ఎంపీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వమే సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తుంది : టీజేఏసీ కోఛైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేయడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల దీక్షపై ఎందుకు స్పందించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రాంత నేతలు నిరసన తెలిపితే అడ్డుకున్న పోలీసులు…

హైదరాబాద్‌ది గొప్ప సంస్కృతి : స్వామిగౌడ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ సంస్కృతి చాలా గొప్పదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ చెప్పారు. ఆనాడే హైదరాబాద్‌లో ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడేమో తాము అభివృధ్ది చేశామని సీమాంధ్ర నేతలు చెప్పడం అర్ధరహితమన్నారు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌కు…

శాంతిర్యాలీకి అనుమతివ్వాలి : కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహిచబోయే శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని ఆయన…

ఢిల్లీ బయల్దేరిన పీఆర్‌టీయూ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతినికి చెందిన పీఆర్‌టీయూ నేతలు ఈ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.