Monday, 9 November 2026

తెలంగాణ

వెయ్యి రూపాయల జీవోను పున:సమీక్షించాలి : హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నో పార్కింగ్‌ స్థలంలో వాహనాన్ని నిలిపితే రూ. వెయ్యి జరిమానా విధించే జీవోను పున:సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వం ఆదేశించింది. జీవోపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

రేపో మాపో కాంగ్రెస్‌ పతనం ఖాయం : కిషన్‌రెడ్డి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయింది. ప్రస్తుతం ఐసీయూలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు. మందమర్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేపోమాపో కాంగ్రెస్‌ పతనవడం ఖాయమని ఆయన చెప్పారు. భారత…

సీఎం కిరణ్‌ వి నీచరాజకీయాలు : ప్రకాశ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే నీటి యుద్ధాలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ ధ్వజమెత్తారు. సీఎం కిరణ్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే నీటి యుద్ధాలు…

యువతిపై యాసిడ్‌ దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): అనంతపురం జిల్లా ముదిగుబ్బలో  ఒక యువతిపై యాసిడ్‌ దాడి జరిగింది. గాయపడిన ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. రాఘవ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకోడంపై రాఘవను…

రాజీనామాలతో తెలంగాణ ఆగదు : గండ్ర వెంకటరమణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజీనామాలు, ఒత్తిల్లతో తెలంగాణ ఆగదు అని తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్రాంతానికో మాట, పూటకో మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచిది…

సచివాలయంలో పోటాపోటీగా నిరసనలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ , సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు చేస్తున్నారు. తెలంగాణ, సమైక్య నినాదాలతో సచివాలయం దద్దరిల్లుతుంది.

సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటాం : పిడమర్తి రవి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 7 న ఏపీ ఎన్టీవోలు నిర్వహించే సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి తేల్చిచెప్పారు.  ఎవరైనా ఉద్యోగులు సభకు వస్తే హైదరాబాద్‌లో ఉండే హక్కును కోల్పోతారని ఆయన అన్నారు. 7…

3 నుంచి ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 3 నుంచి 12 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు అని ఉన్నత విద్యామండలి తెలిపింది. 13,14 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. 17 న సీట్ల కేటాయింపు జరుగనుంది. 23…

ఎన్వీ రమణకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి చేరడానికి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొటున్నట్లు తెలిపారు.…

స్వామిగౌడ్‌ ఇంట్లో భారీ చోరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ ఇంట్లో చోరి జరిగింది. రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం నుంచి దొంగలు భారీ ఎత్తున సొమ్మును దోచుకెళ్లారని తెలుస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.