Monday, 9 November 2026

తెలంగాణ

ముగిసిన బీజేపీ మహాదీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీసీల కోసం ఉప ప్రణాళిక ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల మహాదీక్ష ముగిసింది. దీక్షలో ఉన్న కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణకు ఆ పార్టీ సీనియర్‌ నేత దత్తాత్రేయ…

విద్యుత్‌ సౌధ వద్ద టీజేఏసీ నాయకుల అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): విద్యుత్‌ సౌధ దగ్గర ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, టీజేఏసీ నాయకుడు అద్దంకి దయాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వీరిని బయటి వ్యక్తులకు ఇక్కడ ప్రవేశం లేదని…

సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు ముల్కీ వారంగా ప్రకటిస్తాం : కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యచరణపై చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ సెప్టెంబరు 1 నుంచి 7 వరకు ముల్కీ అమరవీరుల స్మృతి…

ఉద్యమాల ప్రభావం పరిశ్రమలపై లేదు : పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌:,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ పరిశ్రమలపై లేదని రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఉద్యమాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోతున్నాయనే వాదనలల్లో వాస్తవం లేదన్నారు. కొత్త పరిశ్రమలు హైదరాబాద్‌కు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. సౌతాఫ్రికా ప్రతినిధులు…

నిరసనలు శాంతియుతంగా చేయాలి: సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిరసనలు శాంతియుతంగా వ్యక్తం చేయాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగేలా ఆందోళనలు వద్దని  నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ కోరారు. ప్రభుత్వ కార్యాలయల్లోకి బయటి వ్యక్తులొచ్చి ఆందోళన చేస్తే ఊరుకోం అని సీపీ హెచ్చరించారు.

తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంది : మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం,(జనంసాక్షి): ఆంధ్రలో భద్రాచలం కలపాలనే డిమాండ్‌ అర్థరహితమని డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంకు ఉందని ఆయన చెప్పారు. భద్రాచలంపై రాద్దాంతం చేయడం తగదన్నారు.

హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌,(జనసాక్షి): హైదరాబాద్‌ మార్కెట్లో మంగళవారం బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,410, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,700 గా ఉంది. కిలో వెండి…

తెలంగాణ యువకుడిపై ఆంధ్రా బిల్డర్‌ దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో ఆంధ్రా వాళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ యువకుడిపై ఆంధ్రా బిల్డర్‌ కిషోర్‌ తన సభచరులతో కలిసి దాడి చేశారు. తన వాచ్‌మెన్‌గా పని చేస్తున్న యువకుడు ఆకయ్యను కిషోర్‌ తీవ్రంగా కొట్టాడు. అవమానంతో…

బస్‌ భవన్‌ ఎదుట ఈయూ శాంతి దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌ భవన్‌ ఎదుట ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) శాంతి దీక్ష చేస్తుంది. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఈయూ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీక్షను కవరేజ్‌ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు ఆంక్షలు…

నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సామాచారం అందించారు. పోలీసులు, బాంబ్‌స్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.