Monday, 9 November 2026

తెలంగాణ

సీఎం కిరణ్‌తో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు జానారెడ్డి సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, డీకే అరుణ, సునితా లక్ష్మారెడ్డి తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

సీఎం, బొత్సలపై నిప్పులు చెరిగిన పొంగులేటి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన విషయంలో వారిద్దరి వైఖరిని ఆయన తప్పుబట్టారు. సీమాంధ్రలో సోనియాను అవమానపరుస్తుంటే ఖండించాల్సింది పోయి ప్రేక్షక పాత్ర…

జానారెడ్డితో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి జానారెడ్డితో మంత్రులు బసవరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. తెలంగాణ విజయోత్సవ సభలు ఎప్పుడూ ఎలా నిర్వహించాలని అనే అంశంపై వారు చర్చించినట్లు సమాచారం.

సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదు : పెద్దిరెడ్డి

ఖమ్మం,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకే కాదు యావత్‌ తెలుగు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలబడే నాయకుడు అని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదని విమర్శించారు. సీఎం కిరణ్‌, చంద్రబాబు…

జగన్‌తో భార్య భారతి ములాఖత్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైలులో జగన్‌తో ఆయన భార్య భారతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయమ్మ దీక్ష భగ్నం, ప్రస్తుత పరిస్థితులను జగన్‌కు భారతి వివరించినట్లు సమాచారం.

మంత్రి గీతారెడ్డి వాహనం బోల్తా

హైదరాబాద్‌,(జనంసాక్షి): నల్గొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జాతీయరహదారిపై మంత్రి గీతారెడ్డి ఎస్కార్‌ వాహనం బోల్తా పడింది. పశువులు అడ్డురావడంతో అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

టీ అడ్వకేట్‌ జేఏసీ శాంతి దీక్ష వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన దీక్ష వాయిదా పడింది. త్వరలోనే శాంతి దీక్ష చేపడుతామని న్యాయవాదుల జేఏసీ పేర్కొంది.

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): వరంగల్‌ పోలీసుల ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మాడివి దులాలాం, కడియం పొజ్జె అలియాస్‌ సునీత పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాణిబోధి క్యాంప్‌పై దాడి చేసిన కేసులో వీరు నిందితులు.

రైళ్లలో చోరి చేస్తున్న దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్‌లో పోలీసులు అదుపులకి తీసుకున్నారు. కాజీపేటలో చోరి చేస్తుండగా నలుగురు సభ్యులు ఉన్న దొంగల ముఠాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రేపు తెలంగాణ కవుల యాక్షన్‌ ప్లాన్‌ : గౌరీశంకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టాలని, హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్లలో కవులు ,…