Monday, 9 November 2026

తెలంగాణ

స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తిరుమల వెంకటేశ్వరస్వామి స్వర్ణరధానికి బంగారు తాపడం పనులను తితిదే ఈవో గోపాల్‌ సోమవారం ప్రారంభించారు. 32 అడుగుల ఎత్తుగల శ్రీవారి స్వర్ణరథం నిర్మాణానికి రూ. 23.80 కోట్ల తితిదే ఖర్చు చేయనుంది.

సీబీఐ కోర్టుకు హాజరైన సబిత, ధర్మాన

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులు సోమవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై న్యాయమూర్తి ఎదుట తమ వాదనలు వినిపించారు. మరోపక్క అక్రమాస్తుల కేసులో జుడిషియల్‌ రిమాండ్‌…

కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వాటర్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు. ఆర్‌ఎంవోకు మెమో జారీ చేశారు.

జగన్‌ జైల్లో ఎందుకు దీక్ష చేస్తున్నట్లు ? : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): జైల్లో జగన్‌  ఎందుకు దీక్ష చేస్తున్నాడో చెప్పాలని టీఆర్‌ంఎస్‌ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. లక్ష కోట్లు ప్రజాధనం దోచుకున్నది చాలక ఇంకా దోచుకునేవదుకు అవకాశం ఇవ్వమని దీక్ష చేస్తున్నట్లు ఉన్నదని హరీష్‌ ఎద్దేవా చేశారు.…

వినియోగదారులే విద్యుత్‌ ఉత్పాదకదారులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సౌర విద్యుత్‌ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వినియోగదారుడే విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుని తనకు అవసరమైన మేర వాడుకుని మిగిలినది విద్యుత్‌ సంస్థలకు అమ్ముకునేలా నెట్‌ మీటరింగ్‌ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు.

హైదరాబాద్‌ గురించి మాట్లాడితే ఖబర్ధార్‌: కె. కేశవరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చరిత్ర తెలియకుండా హైదరాబాద్‌ గురించి మాట్లాడితే బాగుండదని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌లో సినిమా రంగం మాఫియాలుగా మారి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని ఇది ఎంత మాత్రం సహించరానిదన్నారు. అడుగు అడుగునా విష…

సీఆర్పీఎఫ్‌లో భారీ కుంభకోణం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఆర్పీఎఫ్‌లో భారీ కుంభకోణం జరిగింది. కానిస్టేబుల్‌ దుర్గప్రసాద్‌ పెన్షనర్ల అకౌంట్‌ నుంచి రూ. 40 లక్షలను తన భార్య పేరుపై ఉన్న అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

అమీర్‌ఖాన్‌కు ఉర్దూ విశ్వవిద్యాలయం డి.లిట్‌ పట్టా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రముఖ బాలివుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌కు డి.లిట్‌ పట్టాను మౌలానా ఆజాద్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. అమీర్‌ఖాన్‌ తరపున పట్టాను ఆయన తల్లి వహీదా బేగం స్వీకరించారు.

తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ బహిరంగ సభలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. 25 తేదీనన మహబూబ్‌నగర్‌లో 28 వ తేదీన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సభలు ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిసింది.

సీఎంతో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రుల సమావేశం ముగిసింది. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తుంది.