Monday, 9 November 2026

తెలంగాణ

26, 27 తేదీల్లో బీసీల మహా ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కే.లక్ష్మణ్‌…

ఏసీబీ వలలో చిక్కిన నల్లకుంట ఎస్‌ఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ నల్లకుంట ఎస్‌ఐ షేక్‌ మస్తాన్‌ అలీ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తులసిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీ న్యాయవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న 20 సూత్రాల అమలు పథకం కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డిపై టీ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసౌధలో తెలంగాణ ఉద్యోగులపై దాడి చేయించేందుకు ప్రయత్నించిన తులసిరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని…

యూటీ చేస్తే అందరికీ నష్టమే: దానం నాగేందర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ను  కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అందరికీ నష్టమే అని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నామని ఆయన…

వరంగల్‌ జిల్లాలో దారి దోపిడీ

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలో దారి దోపిడీ జరిగింది. వర్దన్నపేట మండలం పున్నేల్‌ రెడ్‌ నుంచి ఐనవోలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 1.70 లక్షలు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు…

50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌,(జనంసాక్షి): నారాయణఖేడ్‌ మండలం గోప్యానాయక్‌ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బీజేపీ అంతర్యమేమిటి? : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లోక్‌సభలో బీజేపీ ప్రవర్తిస్తున్న తీరుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం లోక్‌సభలో పోరాడిన టీ ఎంపీలను సస్పెండ్‌ చేసినప్పుడు స్పందించాని బీజేపీ సీమాంధ్ర ఎంపీల పంపివేతను ఎందుకు అడ్డుకుంటుందని…

జానారెడ్డి ఛాంబర్‌లో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఛాంబర్‌లో టీ మంత్రులు భేటీ అయ్యారు. అధిష్ఠానం వద్ద సీమాంధ్ర నేతల లాబీయింగ్‌కు అడ్డుకట్ట వేసేలా టీ మంత్రులు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు…

తెలంగాణ ఉద్యమాన్ని నిషేధించడం దారుణం : కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం పట్ల సీమాంధ్ర ఛానళ్లు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్న సీమాంధ్ర ఉద్యమాన్ని నిరంతరాయంగా ప్రసారం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న సద్భావన ర్యాలీలను…

చెల్లెలిపై కర్రతో అన్న దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మియాపూర్‌ మెట్రో పాలిటన్‌ కోర్టు ఆవరణలో చెల్లెలిపై అన్న కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో చెల్లెలు తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.