Sunday, 8 November 2026

తెలంగాణ

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర ఇవాళ రూ. 26,570లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,150లు, కిలో వెండి ధర రూ. 41,100లుగా ఉంది.

ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్న రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ రమాకాంత్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ విడుదల అయిన…

ఎస్టీ మహిళ కిడ్నాప్‌

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కీదేడు పంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు. దాంతో కీదేడు గ్రామంలో ఉన్న ఏకైక ఎస్టీ మహిళను ఓ పార్టీ నాయకులు అపహరించడంతో తల్లిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాలంటూ ఆమె…

గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు పయ్యావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు రావడం దురదృష్ణకరమని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థ ఏరకంగా పనిచేస్తుందో అనే దానిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు…

పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు కల్పిస్తామని డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామకక్షలు చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రం నుంచి అదనపు బలగాలు…

ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సరూర్‌నగర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కొందరు మోసం చేశారు. నిరుద్యోగుల నుంచి వారు దాదాపు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

ఉత్తరాఖండ్‌ బాధితులకు ఓ రోజు వేతనం విరాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితుల సహాయం కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బేగంపేటలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం సమీపంలోని ఆ సంఘం కార్యాలయంలో…

ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి: సీఎం

హైదరాబాద్‌: సమాజంలో మార్పు రావాలంటే ఇంటినుంచే ఆ మార్పు మొదలు కావాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమాజంలో మార్పులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. 2005 నుంచి 2011 వరకు 70 వేల వరకు బంగారు…

సీతారామరాజును అరెస్టు చేసిన సీసీఎస్‌ అధికారులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చేలా చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్ధులతో బేరసారాలు దిగిన కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు సోమవారం కమిషన్‌ సభ్యుడు సీతారామరాజును అరెస్టు…