Sunday, 8 November 2026

తెలంగాణ

సిద్థిపేటలో హరీశ్‌రావు అరెస్టు

మెదక్‌: సిద్ధిపేట అర్టీసీ బస్‌ డిపో ఎదుట అందోళన చేస్తున్న తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ, సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ వినేష్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ శనివారం అసెంబ్లీకి విచ్చేశారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. చలో అసెంబ్లీ సందర్బంగా నిన్నటి పరిమాణాలపై డీజీపీ ఈ సందర్భంగా పోలీసు అధికారులతో చర్చించారు.

అసెంబ్లీపై తెలంగాణ జెండా ఎగిరింది: కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ విజయవంతమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఛలో అసెంబ్లీ ఆందోళన అనంతరం ఆయన ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి ఛలో అసెంబ్లీ ఆందోళనతో అసెంబ్లీపై తెలంగాణ జెండా ఎగిరిందని అభివర్ణించారు.…

భారీ వర్షం కారణంగా 50 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ వాగు ఉధృతితో అంతరాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జేనాథ్‌ మండలంలో…

హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ జేడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జేడీ అరుణాచలం హైదరాబాద్‌ చేరుకున్నారు. నేడు సీబీఐ జేడీగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 28 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర…

హన్మకొండలో టీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

వరంగల్‌, (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పిలుపు మేరకు వరంగల్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతుంది. హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావుతో పాటు 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

నల్గొండ జిల్లాలో ప్రశాతంగా బంద్‌

నల్గొండ,(జనంసాక్షి): అక్రమ అరెస్టులకు నిరసనగా కేసీఆర్‌ ఇచ్చిన బందు పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో బంద్‌ ప్రశాతంగా జరుగుతోంది. జిల్లాలోని చాలా బస్‌ డిపోల వద్ద తెలంగాణ వాదుల ఉదయాన్నే బైఠాయించారు. పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ నేతలను, కార్యకర్తలను…

నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన

కరీంనగర్‌ : తెలంగాణ బంద్‌కు మద్దతుగా రామగుండం ఒకటో బొగ్గుగనిలో కార్మికుల నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గోదావరిఖని అర్టీసీ డీపో ఎదుట తెరాస శ్రేణుల అందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ డిపో…

జంటనగరాల్లో యథావిధిగా బస్సు సర్సీసులు

హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడస్తున్నాయి. డిపోల ఎదుట బైఠాయించిన తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నారు.