Sunday, 8 November 2026

తెలంగాణ

సిద్ధిపేట డిపో ఎదుట హరీశ్‌రావు ఆందోళన

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. సిద్ధిపేట ఆర్టీసీ డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు నాయకులు, కార్యకర్తలు అందోళనకు దిగారు. బంద్‌ నేపథ్యంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

తెలంగాణవాదుల విజయం : అల్లం నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీలో తెలంగాణవాదులు విజయం సాధించారని తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం దమనకాండ సృష్టించిందన్నారు. భవిష్యత్‌లో కూడా తెలంగాణవాదం వినిపిస్తామని ఆయన చెప్పారు.

కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మంథని డివిజన్‌లో భారీ వర్షం వల్ల పెద్దంపేట, సర్వాయిపేట, తీగలవాగులు పొంగిపొర్లుతున్నాయి. అటవీ ప్రాంతంలోని 17 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మెట్‌పల్లిలో భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం…

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు నారాయణ పిలుపు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మగ్దూంభవన్‌పై పోలీసుల దాడికి నిరసనగా సీపీఐ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రేపు రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఓయూ విద్యార్థి పరిస్థితి విషమం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసుల బాష్పవాయువు ప్రయోగంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి కృష్ణానాయక్‌ పరిస్థితి విషమంగా ఉంది. మెదట గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. మరో 20…

అరెస్టులను ఖండించిన కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖండించారు. జేఏసీ నేతలు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణవాదులు అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు తెలంగాణవాదులను పోలీసులు…

రేపటి బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

హైదరాబాద్‌ : తెరాస పిలుపు మేరకు రేపు జరగబోయే తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్లు బంద్‌కు మద్దతు తెలిపాయి.

సీఎం పగసాధిస్తున్నట్లు కన్పిస్తోంది

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజలు తన వద్దకు వస్తానంటేదొడ్డిదారిన పారిపోయిన సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శించారు.

అరెస్టు చేసిన నేతలను ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టు చేసిన నేతలను పలువురిని పోలీసులు ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. తెరాస ఎంపీ విజయశాంతి, నేత కేకే, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాసగౌడ్‌ తదితరులను ఫలక్‌నుమా పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అర్ధాంతరంగా ముగిసిన మిస్త్రీ పర్యటన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతగా ఇక్కడకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కార్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మధుసూదన్‌ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్దాంతరంగా ముగిసింది. ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మిగిలిన జిల్లాల సమీక్షలు…