Sunday, 8 November 2026

తెలంగాణ

పోలీస్‌ సిబ్బందిని సస్పెన్షన్‌ చేసిన ఐజి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మీర్‌పేటలోని పోలీస్‌ సిబ్బంది ఆరుగురిపై సస్పెన్షన్‌ వేటు పడిరది. ఇద్దరు ఎస్‌ఐలను , నలుగురు కానిస్టేబుళ్లను ఐజి సస్పెండ్‌ చేశారు. ఓ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకోవడానికి వీరే కారణమని ఆరోపణలు ఉన్నాయి.

సీఎంకు ఝలక్‌ ఇచ్చిన వరంగల్‌ జిల్లా నేతలు

వరంగల్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి వరంగల్‌ జిల్లా నేతలు ఝలక్‌ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్‌ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీ అధ్యక్షుడి పదవిని దొంతు మాధవరెడ్డికి ముఖ్యమంత్రి కట్టబెట్టాలనుకున్నా ఫలితం…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మెదక్‌ జిల్లా : ఝరాసంగం మండలం మాచునూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వానలు…

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

హైదరాబాద్‌ : గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబునాయడు, నందమూరి హరికృష్ణ , బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం…

అన్నివర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా

-సినీ నటుడు బాలకృష్ణ హైదరాబాద్‌ : మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి బాలకృష్ణ ప్రసంగించారు. అన్ని వర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా…

నేడు హుస్నాబాద్‌కు రానున్న కేసీఆర్‌

కరీంనగర్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ హుస్నాబాద్‌కు వెళ్లనున్నారు. హుస్నాబాద్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ నియోజక వర్గస్ధాయి శిక్షణా తరగతులను ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రాజకీయంగా…

రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రామగుండంలో 40.9, నిజామాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా … చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే : కోదండరాం

వరంగల్‌ : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఐకాస చేపట్టిన బస్సుయాత్ర వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. బయ్యారం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎలా…

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

ఆదిలాబాద్‌ : లంచం తీసుకుంటూ గుడిహత్నూర్‌ తహసీల్దార్‌ రాజేశ్వర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టాదారు పాన్‌ పుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ తన నివాసంలో లంచం తీసుకుంటండగా…