గాలి జనార్థన్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
హైదారాబాద్, జనంసాక్షి: బెయిల్ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జూన్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
హైదారాబాద్, జనంసాక్షి: బెయిల్ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జూన్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
వరంగల్, జనంసాక్షి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
భూపాలపల్లి, జనంసాక్షి: మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి సంఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటు చేసుకుంది. కామాంధుడ్ని గ్రామస్థులు పట్టుకుని దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు…
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకంపై కావాలనే కొందరు క దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అమ్మహస్తం కార్యక్రమంలోని లోపాలను సవరిస్తామని తెలిపారు. అమ్మహస్తం కోసం జిల్లాకొక అధికారిని ఇవ్వాలని సీఎస్‌ను కోరామని…
హైదరాబాద్, జనంసాక్షి: భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 19733 పాయింట్ల వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల పతనంతో 5982 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ సూచీ…
ఆదిలాబాద్, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు సజీవదహనమయ్యాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు…
హైదరాబాద్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి జనాలు తల్లడిల్లుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 46, నిజామాబాద్‌లో 45,5 హైదారాబాద్, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మెదక్, జనంసాక్షి: జిల్లాలోని దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ అయ్యాడు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పదింటికి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరడు ఆరోపించినట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాల సభ్యులు తీవ్ర…
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో పార్కింగ్ వసూళ్లను నిరసిస్తూ వాహనదారులు ధర్నాకు దిగారుదీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కూరగాయాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.