Friday, 6 November 2026

తెలంగాణ

మేనల్లుడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు : బన్సల్‌

న్యూఢిల్లీ : లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన తన మేనల్లుడు వి.సింగ్లాతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని రైల్వే శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ వెల్లడించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.…

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని మంత్రి పార్థపారథి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను ఏబీవీపీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కీర్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి

నాచారం, హైదరాబాద్‌ : నిర్మాణంలో ఉన్న నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం 8వ అంతస్తు నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతున్ని బీహార్‌కు చెందిన పురానా (18) అనే యువకుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి…

చంచల్‌గూడ జైలుకు 14 మంది తరలించిన పోలీసులు

చంచల్‌గూడ, హైదరాబాద్‌ : కాకినాడలో తీర ప్రాంత భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్న 14 మంది శ్రీలంక జాలర్లను కాకినాడ మెరైస్‌ పోలీసులు ఈ ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనుమతులు లేకుండా భారత సముద్ర జలాల్లో చేపల వేటను…

6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం  నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వన విజ్ఞాన్‌ కేంద్రం నుంచి తప్పిపోయిన ఎలుగుబంట్లు

వరంగల్‌ : హన్మకొండ హంటర్‌ రోడ్డులోని వనవిజ్ఞాన్‌ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సౌర విద్యుత్‌ కేంద్రాన్ని తరలించాలని ఎమ్మెల్యే రాస్తారోకో

గోదాదరిఖని : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఎన్టీపీసీ సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జనావాసాల మధ్య ఉన్న 62 ఎకరాల స్థలాన్ని…

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ వెంకటరమణ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: కొల్లాపూర్‌ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.

స్థాయీ సంఘాల ఛైర్మన్లతో మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ భేటీ

హైదరాబాద్‌ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల సమీక్షకు ఈ సమావేశంలో రోడ్‌ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు.

హైకోర్టు ఘటనపై సుప్రీం సీరియస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ కాలంలో  హైకోర్టులో జరిగిన ఘటనపై సప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పుడే ఉద్యమకారులు న్యాయమూర్తులను అడ్డుకునే ప్రయత్నం…