Friday, 6 November 2026

తెలంగాణ

నేటి ప్రారంభమైన మూడు రోజులపాటు రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు

సికింద్రాబాద్‌: రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో రైల్యే ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. దక్షిణ మధ్య గుర్తింపు పొందేందుకు 4 యూనియన్‌ సంఘాలు పటీపడుదున్నాయి,…

భూకేటాయింపులు రద్దు చేయడంలో ఆలస్యం చేశారన్న తెదేపా నేత

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేల ఎకరాల భూమిని వైఎస్‌ తన అల్లుడికి రాసిస్తుంటే తెరాస అధినేత…

బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌ సంస్థకు భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయింపుల రద్దు దస్త్రంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. తూగుటపల్లి , పి. బొమ్మపల్లి, కొత్తగుంటపల్లి, వేగుంటపల్లిలో భూకేటాయింపులను ప్రభుత్వం వెనక్కితీసుకోనుంది.…

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ ఆటోడ్రైవర్‌

కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌: మూసాపేట్‌లో భవానీనగర్‌కు చెందిన దుర్గా దేవయ్య దంపతులు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఐదేళ్లపాప ఉంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని తన…

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

హైదరాబాద్‌: మలక్‌పేట మూసారంబాగ్‌లోని టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి చక్రతీర్థం స్నానం

ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా గోదావరి తీరంలో చక్రతీర్థం స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం

హైదరాబాద్‌:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్‌ పవర్‌ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జూపార్కులొ ఎలుగుబంటి దాడి

హైదరాబాద్‌:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.