Thursday, 5 November 2026

తెలంగాణ

సింగరేణిలో కార్మికసంఘాల ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: సింగరేణి ఎంట్రీ గనిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) మృతికి నస్టనరిహారం చెల్లించాలని గోదావరిఖని సింగరేణిలో కార్మికసంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిన్న రాత్రి ఎండీ గాలిబ్‌ గనిలోని 75 లెవల్‌ వద్ద…

ఆకతాయిల చేతిలో దహనమైన 14 బైకులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ కాలనీలోని కేకే రెసిడెన్సీ సెల్లార్‌లో ఈ తెల్లవారు జామున ఆకతాయిలు 14 ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. దీంతో మెదటి అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని…

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ మహిళ మృతి

దౌల్తాబాద్‌, జనంసాక్షి మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడింది. ఆమె తలకు తీవ్రగాయాలు…

మహిళ కాళ్లు నరికి వెండి కడియాల అపహరణ

హైదరాబాద్‌, జనంసాక్షి: వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి ఆగంతకులు దారుణంగా హత్యచేశారు. నగర శివారు కోకాపేట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోకాపేటలో శంకరమ్మ అనే మహిళ పాత సామాన్ల దుకాణం నిర్వహిస్తోంది .…

సింగరేణి కార్మికుడు మృతి

గోదావరిఖని,జనంసాక్షి: కరీంనగర్‌ సింగరేణి ఎంట్రీ గనిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడు ఎండీ గాలిబ్‌ (35) నిన్న రాత్రి మృతి చెందాడు. గనిలోని 75 లెవల్‌ వద్ద రోడ్డు పనులు చేయిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు చికిత్స…

9 మంది మావోయిస్టుల మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఆంద్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసుకు మావోల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 9 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు 15 కిలో మీటర్లు దూరంలో ఉన్న కిష్టారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమ్మరితోపు…

నేడు సిక్కోలు పర్యటించనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం ఇందిరమ్మ కలల కార్యక్రమాల్లో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

కరవుపై కేంద్ర బృందం సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరవు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరవు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో బృందం సమీక్షించింది.

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి…

రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం…