Wednesday, 4 November 2026

February 2013

జాతీయం

సూట్‌కేసుల కలకలం

న్యూఢిల్లీ : ఏపీ భవన్‌, పార్లమెంటు భవనం మధ్యలో బాబూ రాజేంద్రప్రసాద్‌ రహదారిలో పడి ఉన్న రెండు సూట్‌కేసులు కలకలం సృష్టించాయి. బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది వీటిని తనిఖీ చేస్తున్నారు.

జాతీయం

పేలుళ్లపై ముందుగానే హెచ్చరించాం : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ ఉగ్రవాదుల నుంచి దాడుల  ప్రమాదం ఉందని, పేలుళ్లు జరగవచ్చని నిన్న ఉదయమే హైదరాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. హైదరాబాద్‌, బెంగుళూరు. కోయంబత్తూరు, హుబ్లీలలో కూడా పోలీసులను హెచ్చరించినట్లు ప్రకటించింది.

కరీంనగర్

పేలుళ్లలో గాయపడిన కరీంనగర్‌ వాసి

సైదాపూర్‌: హైదరాబాద్‌ బాంబు పేలుళ్లలో రాయికల్‌ గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థి యూ. రాజీవ్‌కుమార్‌ గాయపడ్డాడు. ఇబ్రహీంపట్నంలో శ్రీదత్తా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కంప్యూటర్‌ క్లాస్‌ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.…

హైదరాబాద్

సీఎంతో చిరంజీవి భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. దిల్‌ఘక్‌నగర్‌ పేలుళ్లలో గాయపడిన వారిని ఓమ్మి ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి తెలుసుకున్నారు.

కరీంనగర్

పట్రోల్‌ బంక్‌పై భాజాపా కార్యకర్తల దాడి

కరీంనగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనను నిరసిస్తూ నేడు భాజాపా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆ పార్టీ కార్యాకర్తలు ఈ ఉదయం నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలో తెరిచి ఉంచిన పెట్రోల్‌ బంక్‌…

ఆదిలాబాద్

భాజపా ఆధ్వర్యంలో బంద్‌

ఖైంసా: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో ఖైంసా పట్టణంలో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపారులు స్వచ్చందంగా మద్దతునిచ్చారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఖైంసా డిపో ఎదుట భాజసా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.…

ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలకు ముందస్తు సెలవు

కాగజ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా కాగజ్‌నగర్‌లో విద్యా సంస్థలు బంద్‌ పాటించాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యజమానులు ముందస్తు సెలవు ప్రకటించారు.

జాతీయం

సమాచారం అందించటమే కానీ కేంద్రం చర్యలు తీసుకోదా? : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ ఘటనపై షిండే ప్రకటన సాదాసీదాగా ఉందనిలోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ మండిపడ్డారు. మూడు రోజులల ముందే కేంద్రం సమాచారం అందించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు అప్రమత్తం కాలేదని ఆమె ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి…

జాతీయం

లోక్‌సభలో హైదరాబాద్‌ పేలుళ్ల ఘటనపై షిండే ప్రకటన

న్యూఢిల్లీ : రెండుసార్లు వాయిదా అనంతరర లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్‌ పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి షిండే లోక్‌సభలో ప్రకటించారు. నిన్న సాయంత్రం 6.58, 7.01 గంటలకు రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల…

హైదరాబాద్

ఓమ్మి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన చిరంజీవి

హైదరాబాద్‌: ఓమ్మి ఆసుపపత్రిలో చికిత్స పొందుతున్న దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌లు పరామర్శించారు.