Wednesday, 4 November 2026

February 2013

జిల్లా వార్తలు

ఎన్‌టీఆర్‌ నగర్‌వాసుల మౌనదీక్ష

సరూర్‌నగర్‌ పట్టణం: దిల్‌షుక్‌నగర్‌లో వరస బాంబు పేలుళ్లను నిరసిస్తూ ఎన్‌టీఆర్‌ నగర్‌ వాసులు మౌనదీక్షను చేపట్టారు. నోటికి నల్లగుడ్డ ట్టుకుని రెండు గంటలపాటు మౌనదీక్ష చేపట్టారు. పేలుళ్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

జాతీయ రహదారిపై నిరసన చేపట్టిన విద్యార్థులు

అబ్దుల్లాపూర్‌మెంట్‌: సంజయ్‌గాంధీ స్మారక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అంబర్‌పేటకు చెందిన అజాజ్‌అహ్మద్‌ నిన్న జరిగిన పేలుళ్లలో మృతి చెందడంతో కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. పేలుళ్లకు నిరసనగా కళాశాల ముందు జాతీయ…

జిల్లా వార్తలు

నోవా కళాశాల విద్యార్థుల ర్యాలీ

అబ్దుల్లాపూర్‌మెంట్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో నిన్న జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన నోవా కళాశాల విద్యార్థి ఆనంద్‌కు హయత్‌నగరం మండలం, జాఫర్‌ గూడలోని నోవా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు నివాళులు అర్పించారు. అనంతరం నోవా కళశాల నుంచి అబ్దుల్లాపూర్‌మెంట్‌ వరకు…

జిల్లా వార్తలు

వికారాబాద్‌లో బంద్‌ విజయవంతం

వికారాబాద్‌ గ్రామీణం: బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో వికారాబాద్‌లో నిర్వహిస్తున్న బంద్‌ విజయవంతమైంది. దుకాణాలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్‌లు పెట్రోల్‌ బంక్‌లు మూసివేశారు. భాజపా నాయకులు, కార్యకర్తలు వికారాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు.

జిల్లా వార్తలు

కుత్బుల్లాపూర్‌లో భారీ చోరీ

కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. తాళం పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి రూ.3.25లక్షలు అపహరించారు. మగ్థంనగర్‌కు చెందిన జైపాల్‌ రెడ్డి నూనె వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా అతను గురువారం రాత్రి…

జిల్లా వార్తలు

బాంబు దాడులను నిరసిస్తూ రాస్తారోకో

దంతాలపల్లి: హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడులను నిరసిస్తూ నరసింహులపేట మండలం దంతాలపల్లిలో భాజపా, ఏబీవీపీ, ఎన్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాంబు దాడులకు పాల్పడిన దుండగులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. ఈ…

జిల్లా వార్తలు

ఉగ్రవాది దిష్టి బొమ్మ దహనం

మంగపేట: హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్లకు నిరసనగా శుక్రవారం మంగపేటలో సీపీఎం ఆధ్వర్యంలో ఉగ్రవాది దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, నాయకులు ఎల్‌ పీ ముత్యాలు, ప్రసాదు, చిన్న, నరేష్‌,…

జిల్లా వార్తలు

భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో భాజపా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా వార్తలు

వనపర్తిలో భాజపా ఆధ్వర్వంలో బంద్‌

వనపర్తి (పట్టణం): బాంబు దాడులను నిరసిస్తూ వనపర్తిలో భాజపా, ఏబీవీపి. ఆర్ప్‌న్‌ఎన్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తున్నారు.

ఖమ్మం

భాజపా ఆధ్వర్యంలో ధర్నా

ఖమ్మం సంక్షేమం: హైదరాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల సంఘటనకు నిరసనగా భాజపా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా పార్టీ నుంచి మయూరి సెంటర్‌ వరకు ప్రదర్శన చేశారు. అనంతరం వ్యాపార సంస్థలను మూసి వేసి…