Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

అబ్యారీ శాఖ కమిషనర్‌తో చర్చలు

హైదరాబాద్‌: మద్యం సిండికేటు వ్యవహారంలో తమపై ప్రాసిక్యూషన్‌ అనుమతిని నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగిన ఎక్సైజ్‌ శాఖ ఇన్‌స్ట్పెర్లు అబ్కారీ శాఖ కమిషనర్‌ను కలిశారు. ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఆయనతో చర్చలు జరిపారు. సిండికేటు వ్యవహారంలో నమోదైన కేసులను మాఫీ చేయడంతోపాటు…

సీమాంధ్ర

ఆటోను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి

కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆదోని నుంచి సూగురుకు ప్రయాణికులతో వస్తున్న ఆటోను కుప్పగల్లు వద్ద లారీ ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో…

జాతీయం

నర్సీరీలో ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదు : ఢీల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : పాఠశాలల్లో నర్సీరీ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నర్సీరీ ప్రవేశాలకు విద్యాహక్కు చట్టం వర్తించదని కోర్టు తేల్చిచెప్పింది. సామాజిక కార్యకర్త అశోక్‌ అగర్వాల్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ…

వార్తలు

పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా మెటాపాల్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. కాల్పులు ఇరువురి మధ్య కొనసాగుతున్నట్లు సమాచారం తెలిసింది.

సీమాంధ్ర

కోరం లేక చిత్తూరులో ఎన్నిక వాయిదా

చిత్తూరు: డీసీసీబీ, డీసీఎంఎన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. నిన్న నిర్వహించిన ఎన్నికల్లో 11 డీసీసీబీ డైరెక్టర్‌ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా… మూడింటిని తెదేపా చేజిక్కించుకుంది.డీసీఎంఎన్‌ డైరెక్టర్‌ స్థానాల్లో మూడింటిలో తెదేపా విజయం…

హైదరాబాద్

స్వామిగౌడ్‌కు తెలంగాణ మాలమహానాడు మద్దతు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి స్వామిగౌడ్‌కు తెలంగాణ మాలమహానాడు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎస్సీ పట్టభద్రులు, మేధావులు స్వామిగౌడ్‌ గెలుపుకు కృషి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐక్యత చాటాలని మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ పిలుపునిచ్చారు.

జిల్లా వార్తలు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి : కవిత

నిజామాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమానికి మేధావుల మద్దతు ఉందని తెలియజేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టభద్రులు, ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రత్యేక రాష్ట్ర…

జాతీయం

బీజేపీ పార్లమెంటరీ బోర్బు సమావేశం

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీతో పాటు పార్టీ…

ఆదిలాబాద్

నిర్మల్‌ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఈ ఉదయం నిర్మల్‌ న్యాయస్థానంలో హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు మార్చి 5కు వాయిదా వేసింది. ఈ కేసులో అక్బరుద్దీన్‌ అరెస్టు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

జిల్లా వార్తలు

రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం

రంగారెడ్డి : జిల్లా డీసీఎంఎస్‌ ఎన్నికలో వివాదం నెలకొంది. డీసీఎంఎస్‌ అధ్యక్ష పదవి ధారాసింగ్‌కు ఇవ్వాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ పట్టుబట్టారు. ధారాసింగ్‌ అభ్యర్థిత్వంపై హోంమంత్రి సబిత అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రవణ్‌కుమార్‌కు డీసీఎంఎస్‌ పదవి కట్టబెట్టాలని…