Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

బావిలో పడి తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని కొడంగల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కొడంగల్‌కు చెందిన సావిత్రి (26) తన ఆరేళ్ల కుమారుడ్ని తీసుకుని ఉతికేందుకు బావి వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు ఇద్దరూ బావిలో పడి మృతి చెందారు.

జిల్లా వార్తలు

ట్రాక్టరు బోల్తా పడి యువకుడి మృతి

దేవరకద్ర: దేవరకద్ర మండలం బలుసుపల్లి వద్ద ట్రాక్టరు బోల్తా పడి ఒక యువకుడు మృతి చెందాడు. బలుసుపల్లికి చెందిన యల్లప్ప (20) ట్రాక్టరు మీద వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టరు డ్రైవరు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయాడు.…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వెల్దండ: మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి పై ఈ ఉదయం కొత్తబస్టాండ్‌ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరిని గోపాలపేట మండలం సాకలపల్లి గ్రామానికి చెందిన రమణయ్యగా గుర్తించారు.

జిల్లా వార్తలు

భద్రకాళీ జాతర ప్రారంభం

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి దేవాలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, కల్యాణమహోత్సవం, ఉదయం…

జిల్లా వార్తలు

స్థానిక ఎన్నికల్లో తెదేపాదే విజయం

చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన మండల తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భువనగిరి: బీబీనగర్‌ మండలం కొలమడుగు గ్రామంలోని విజయలక్ష్మీ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి బేళ్లు తగులబడుతున్నాయి. భువనగిరి, చౌటుప్పల్‌, హైదరాబాద్‌ మౌలాలీ నుంచి అగ్నిమాపక శకటాలు బయలు దేరాయి. భారీఎత్తున నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

వార్తలు

తొమ్మిది మంది మృతి

కాబూల్‌ : అఫ్గన్‌ రాజధాని కాబూల్‌ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి హెగెల్‌ కాబూల్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలోనే ఆత్మాహుతిదాడి జరగడం గమనార్హం. రక్షణశాఖ కార్యలయం ప్రవేశద్వారంలో ఆత్మాహుతి సభ్యుడు…

జిల్లా వార్తలు

కబేళాకు గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

కుత్బుల్లాపూర్‌: గోవులను కబేళాకు తరలిస్తున్న వారిని అడ్డుకుని హిందూ వాహిని, భజరంగదశ్‌ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రాంతం నుంచి రెండు డీసీఎం వాహనాల్లో 35 పశువులను ఎర్రగడ్డ సంతకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న…

హైదరాబాద్

తృతీయ ప్రత్యామ్నాయం ఎండమావే : వెంకయ్య

హైదరాబాద్‌ : దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం ఎండమావేనని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ఇక యూపీఏ సర్కార్‌ పాలనకు ఇదే చివరి సంవత్సరమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను కూడా ఈ ప్రభుత్వం ఓటుబ్యాంకుగా వాడుకుంటోందని వెంకటయ్యనాయుడు…

జిల్లా వార్తలు

విద్యార్థినిపై దుండగుడి దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని మహబూబాద్‌ గిరిజన బాలికల వసతి గృహంలోకి ఒక దుండగుడు ప్రవేశించి విద్యార్థిని పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.