Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లాలో దారుణం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలో శివనగర్‌ జంగాలపల్లిలో 14 ఏళ్ల బాలికపై అరవింద్‌ అనే యువకుడు శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై మున్సిపల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఖమ్మం

రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ఖమ్మం క్రీడలు: రాష్ట్ర స్థాయి ఆహ్వానిత క్రికెట్‌ పోటీలు శనివారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏవీ రంఘనాధ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభించారు. సీఐ నరేష్‌రెడ్డి పర్యవేక్షణలో పోటీలు…

వార్తలు

కన్యా అధ్యక్ష ఎన్నికల్లో కెన్యాట్ట విజయం

నైరోబీ : కెన్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కెన్యా డిప్యూటీ ప్రధాని ఉహురు కెన్యాట్ట విజయం సాధించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలపై ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు అధ్యక్ష…

ఖమ్మం

అశ్వారావుపేట వ్యాట్‌పై వస్త్ర దుకాణాలు బంద్‌

అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అశ్వారావుపేటలో వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాల సంఘం ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వస్త్ర…

ఖమ్మం

విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని ధర్నా

అశ్వారావుపేట: పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రభాకర్‌, కల్లయ్య నాయకత్వం వహించారు.

వార్తలు

పోలవరం కాంట్రాక్టుల కోసమే విపక్షాల రాద్దాంతం : డొక్కా

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుల కోసమే విపక్షాలు రాద్దాంతం చేస్తు న్నాయని మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ ఆరోపించారు. కాంక్ట్రాక్టుల కోసం కాకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం విపక్షాలు ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

వార్తలు

వందేళ్లకు ముందే తెలుగులో తీర్పులు : జస్టిస్‌ రమణ

విజయవాడ : వందేళ్లకు ముందే బ్రిటిషువారు తెలుగులో తీర్పులు వెలువరించారని అయితే మనం మాతృభాష తెలుగులో తీర్పులు వెలువరించకపోవడం బాధాకరమని జస్టిన్‌ రమణ అన్నారు. నగరంలో ఏర్పాటుచేసిన ‘తెలుగులో న్యాయపాలన’ పదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి గర్భంలో…

ఖమ్మం

న్యాయం చేయాలంటూ యువతి ధర్నా

వేలేరుపాడు: ప్రేమించిన యువకుడితో తనకు పెళ్లి చేయాలంటూ గిరిజన యువతి స్థానిక ఠాణా ఎదుట ధర్నాకు దిగింది. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మడివి వనజ కన్నాయగుట్టకు చెందిన కుంజా సాగర్‌ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో…

జాతీయం

మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం

ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గత సంవత్సరం సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో…

ఖమ్మం

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు 200 దరఖాస్తులు

ఖమ్మం సంక్షేమం: జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు 200 దరఖాస్తులు వచ్చినట్లు ఇ-సేవ మేనేజర్‌ రవికిషోర్‌ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి 81, మైదాన్‌ ప్రాంతానికి 134 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.