మళ్లీ పెరగనున్న బంగారం ధర
హైదరాబాద్: బంగారం ధరలు మళ్లీ పెరగసాగాయి. ఇటివల 25 వేల దిగువకి వచ్చిన పసిడి ధర వారం రోజుల్లోనే 1600 రూపాయల మేర పెరిగింది.దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ,మే రెండో వారంలో అక్షయ తృతీయ…
హైదరాబాద్: బంగారం ధరలు మళ్లీ పెరగసాగాయి. ఇటివల 25 వేల దిగువకి వచ్చిన పసిడి ధర వారం రోజుల్లోనే 1600 రూపాయల మేర పెరిగింది.దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడడంతో పాటు ,మే రెండో వారంలో అక్షయ తృతీయ…
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్‌మహల్ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు సమాచారం . పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్: బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేల ఎకరాల భూమిని వైఎస్ తన అల్లుడికి రాసిస్తుంటే తెరాస అధినేత…
న్యూడిల్లీ: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. నాగం భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందిరాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి…
గోదావరిఖని, జనంసాక్షి: ఎన్టీపీసీలోని పోచమ్మ దేవాలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తు హిందువాహిని ఆధ్వర్యంలో మేడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పోచమ్మ దేవాలయానికి రక్షణ లేకపోవడంవల్ల గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలో విగ్రహాలను ధ్వంసం చేశారని వారు పేర్కొన్నారు.…
హైదరాబాద్: బ్రహ్మణి స్టీల్స్ సంస్థకు భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయింపుల రద్దు దస్త్రంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. తూగుటపల్లి , పి. బొమ్మపల్లి, కొత్తగుంటపల్లి, వేగుంటపల్లిలో భూకేటాయింపులను ప్రభుత్వం వెనక్కితీసుకోనుంది.…
కరీంనగర్, శంకరపట్నం మండలం కేశవపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళలు సజీవదహనమయ్యారు.అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అధికారులు ఘటనస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. 12 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.…
గుంటూరు: తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అంగన్‌వాడి నిర్వహకులపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.