Monday, 2 November 2026

April 2013

తెలంగాణ

ధర్మానపై పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి ధర్మానను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌ 5కి వాయిదా వేసింది.

జాతీయం

రాష్ట్రంలో గరిష్ఠసాయిలో ఉన్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 10 గంటలకే గరిష్ఠస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 44,రామగుండం 43, కర్నూలు 42, హైదరాబాద్‌లో 41, నెల్లూరు 41, తిరుపతిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ…

సీమాంధ్ర

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కంచిలి, శ్రీకాకుళం: పురుగుల ముందు తాగి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జలంత్ర మాణిక్యపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన…

జాతీయం

సోనియా ఓఎన్‌డీకి తెలంగాణ ఉద్యోగ సంఘాల వినతిపత్రం

న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఉదయం ఆమె నివాసానికి వచ్చారు. సోనియా ఓఎస్‌డా మాధవన్‌కు వినతి పత్రం అందించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలను త్వరలో చర్చకు పిలుస్తామని…

సీమాంధ్ర

రైస్‌మిల్లు నుంచి దుమ్ము, ధూళి స్తంభివించడంతో గ్రామస్థులు ఆందోళన

సామర్లకోట : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేట్లపాలెంలో రైస్‌మిల్లు నుంచి దుమ్ము, ధూళి పెరిగిపోయిందని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాలుష్య నియంత్రణ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కెనాల్‌ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా 2 కిలోమీటర్ల…

జాతీయం

సీఎం వ్యాఖ్యలు దురహంకారపూరితం: కేటీఆర్‌

న్యూఢిల్లీ: బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడింది. నిన్న సంగారెడ్డి సీఎం చేసిన వ్యాఖ్యలు దురహంకారపూరితమైనవని ఆపార్టీ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఢిల్లీలో తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్కడ ముడి సరకు దొరికితే అక్కడే పరిశ్రమ పెట్టాలన్నది…

సీమాంధ్ర

విషజ్వరాలు వల్ల 100 మందికి అస్వస్థత

బాపట్ల: గుంటూరు జిల్లాలోని బాపట్ల మండలం అప్పికట్లలో విషజ్వరాలు ప్రబలాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందిన సమాచారం మేరకు 100 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణ

ప్రియురాలి కుటుంబసభ్యుల దాడిలో ప్రియుడు మృతి

కరీంనగర్‌: ఇల్లంతకుంట మండలం గుండారంలో ప్రియుడిపై ప్రియురాలి కుటుంబసభ్యులు దాడికి దిగారు. తీవ్రగాయాలపాలైన యువకుడు కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 2009 పాయింట్లపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

తెలంగాణ

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెంగళూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. ఆయన నేడు, రేపు బెంగళూరు శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాననున్నారు.