Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

సీపీఐ నేతల ముందస్తు అరెస్టు

గుంటూరు : జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించిన సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.

అంతర్జాతీయం

ఇజ్రాయిల్‌ ప్రధానికి ఒబామా ఆహ్వానం

వాషింగ్టన్‌ : ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించేందుకు  ఆమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌ ప్రధానికి ఆహ్వానం పంపినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రాంతీయ భద్రత, మధ్య ప్రాచ్య ప్రాంతంలో…

తెలంగాణ

గుంటూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు వెళ్లారు. ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రైతుసదస్సును  ప్రారంభిస్తారు.

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 25 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా .. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

సీమాంధ్ర

50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

డక్కిలి : నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామ సమీపంలో మినీలారీ సహా 50 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.…

Featured News

రెండ్రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో షెడ్యూల్‌ కన్నా రెండ్రోజుల ముందే బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం సభ సమాజవేశం కాగానే లోక్‌సభ అట్టుడుకింది.…

Featured News

సమష్టికృషి.. కర్ణాటక విజయం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీ,మే8(జనంసాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తంచేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు. కర్నాటకలో విజయం…

Featured News

భూకంపం ఎట్లుంటదో చూపెడుతా : కేసీఆర్‌

తెలంగాణ సమస్యలపై పోరుకు కార్యవర్గ నిర్ణయం హైదరాబాద్‌, మే 8 (జనంసాక్షి) : భూకంపం ఎట్లుంటదో చూపెడుతానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు…

Featured News

బెల్ట్‌షాపులు ఎత్తేయండి కార్యాచరణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌,మే 8 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా మద్యంరూపంలో నేరాలుపెరిగిపోతున్నాయని ప్రభుత్వానికి అధికారులు, పోలీసుల నుంచి సమగ్ర సమాచారం ఉన్నప్పటికి అదనంగాఆదాయం వస్తుందన్న ఉద్దేశ్యంతో చూసీ చూడట్లుగా వ్యవహ రించారు. అయితే రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యం సేవించి…

Featured News

పంజరంలో చిలుక సీబీఐ

 కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహ దర్యాప్తు సంస్థను బానిసత్వం విముక్తం చేయాలని ఆదేశం లేదంటే స్వతంత్ర హోదా కల్పిస్తాం : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంపై సీబీఐ చేస్తోన్న దర్యాప్తులో ‘చేయి’ పెట్టడంపై…