Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

ఘనంగా జీవవైవిధ్య దినోత్సవం

హైదరాబాద్‌ : జీవవైవిధ్య సూచీలో హైదరాబాద్‌ నగరం గత ఆరునెలల్లో 39 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు పెరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు వెల్లడించారు. అంతర్జాతీయ జీవివైవిధ్య దినోత్సవం హైదరాబాద్‌లోని ఇమ్లిబస్‌ పార్క్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…

జాతీయం

శ్రీనివాసన్‌ అల్లుడిని ప్రశ్నించనున్న పోలీసులు

న్యూఢిల్లీ : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు విందూ దారా సింగ్‌ అరెస్టు తర్వాత పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, చైన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని అయన ఎన్‌. శ్రీనివాసస్‌ అల్లుడిని…

హైదరాబాద్

నిహారిక ఇండస్ట్రీస్‌ కార్మికుడి ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో లేబర్‌ కాంట్రాక్టరుగా పనిచేస్తున్న ఈడిగ సుధాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్‌ గౌడ్‌ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాజమాన్యం తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య…

తెలంగాణ

శుభలేఖ ఇవ్వడానికే బాబును కలిశాను : గండ్ర

హైదరాబాద్‌ : ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి శుభలేఖను ఇచ్చేందుకు చంద్రబాబును కలిశానని ఇతర రాజకీయ విషయాలేవీ చర్చించలేదని గండ్ర తెలిపారు.

సీమాంధ్ర

అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం

నెల్లూరు, జనంసాక్షి: జిల్లాలోని కొండాపురం మండలం పర్లపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయింది. గుడిసెకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగింది.

సీమాంధ్ర

లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రాన్స్‌కో ఏఏవో

కడప జల్లా : కడప జిల్లా బనగానపల్లెలో ట్రాన్స్‌కో ఏఏవో బాలసుబ్రహ్మణ్యం రూ.27 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. సెక్యూరిటీ గార్డుల జీతాల బిల్లులు చేయడానికి గుత్తేదారు నుంచి బాలసుబ్రహ్మణ్యం డబ్బులు డిమాండ్‌…

సీమాంధ్ర

ఎంపీ సీటు ఇస్తేనే డబ్బూ ఖర్చు పెడతా: ఎంపీ గద్దె రామ్మోహన్‌ రావు

విజయవాడ, జనంసాక్షి: రాజకీయాల్లో డబ్బు ప్రధానమని.. అయితే డబ్బే రాజకీయం కాదని టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ తరపున ఎంపీ సీటు ఇస్తే తేను డబ్బు ఖర్చు పెడతానని…

అంతర్జాతీయం

చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో విస్ఫోటనం

బీజింగ్‌ : చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా, 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. 20 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారి అచూకీకోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

జాతీయం

స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాలి

మదురైలో ప్రజాప్రయోజన వ్యాజ్యం చెన్నై : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక క్రికెట్‌ అభిమాని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి జూన్‌ 10 లోపు వివరణ…

తెలంగాణ

నల్ల ధనాన్ని అరికడితేనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు

హైదరాబాద్‌ : నల్ల ధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీని కాంగ్రెస్‌ నకిలీ బదిలీగా మార్చిందని విమర్శించారు. దేశంలో రూ.70 లక్షల…