Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు

రంగారెడ్డి జిల్లా, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగిద్గిరి గుట్ట, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్దిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ

వారిని అనర్హులుగా ప్రకటించాలి: టిడిపి

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ విప్‌ ధిక్కరించిన 9మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హుతపై ఈరోజు విచారణ జరిగింది. టిడిపి తరపున…

సీమాంధ్ర

పరిగిలో మహిళను నరికి చంపిన ప్రియుడు

అనంతపురం, జనంసాక్షి: పరిగిలో వివాహేతర సంబంధం బెడిసికొట్టింది. లక్ష్మమ్మ అనే మహిళను ప్రియుడు నర్సింహప్ప నరికి చంపాడు. అనంతరం కత్తితో పోడుచుకుని తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

తెలంగాణ

జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనను నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్‌పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. నమ్మకం ద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. ఐసిసి 409సెక్షన్‌…

తెలంగాణ

హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

షెడ్యుల్‌ కంటే ముందుగా టెస్త్‌ ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను ఆరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌…

సీమాంధ్ర

సింహాచలం గోశాలలో 150 దూడల మృతి

విశాఖపట్నం, జనంసాక్షి: సింహాచలం అప్పన్న గోశాలలో గత పది రోజులుగా 150 లేగదూడలు మృతి చెందాయి. గత రెండు రోజుల్లో 20 దూడలు మృతి చెందాయి. భక్తులు స్వామివారికి ఈ దూడలను సమర్పిస్తుంటారు. ఈ దూడలు కూడా అలా…

ఖమ్మం

బయ్యారంలో తెదేనే నేతల ఆందోళన

ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సు యాత్రగా బయ్యారానికి నేతలు చేరుకుని ధర్నా చేపట్టారు. బయ్యారం ఉక్కు -తెలంగాణ…

కరీంనగర్

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

బోయిన్‌పల్లి: బయ్యారం ఉక్కుగనులను విశాఖ ప్లాంటుకు కేటాయించడాన్ని నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలశాఖ అధ్యక్షుడు కొండయ్య, మాజీ సెన్‌ డైరెక్టర్‌ కొనకట్ల అచ్చిరెడ్డి, నాయకులు…

ఆదిలాబాద్

తెలంగాణ కోసం ఒక వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌: క్యాసంపెల్లి గ్రామపంచాయితీ మందమర్రీ మండలం కురుమపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అండుగుల్ల మల్లేషం వయస్సు 24 సంవత్సరాలు తన మీరపతోటలో పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెల్సి గ్రామస్థులు  పోలీసులకు సమాచారం అందించడంతో…