Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

ప్రమాదానికి గురైన ముగ్గురికి గాయాలు

అబ్దుల్లాపూర్‌ మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారు పెద్ద అంబర్‌పేట్‌ నగర పంచాయతీ కూడలి సమీపంలోని డాగ్‌బంగ్లా ప్రాంతంలో అగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న శాంత్రో కారు ఢీకొట్టింది.  ఈప్రమాదంలో లారీ కిందకు కారు దూసుకుపోగా…

తెలంగాణ

వైసీపీలో భగ్గుమన్న విభేధాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విజయమ్మ పర్యటనకు ముందే వైసీపీలో విభేధాలు భగ్గుమన్నాయి. వైసీపీకి ముగ్గురు సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మోహనఖరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.

తెలంగాణ

శంకర్రావును బంజారా కేర్‌ ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి శంకర్రావును మెరుగైన చికిత్స కోసం నాంపల్లి కేర్‌ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజుల నుంచి ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

సీమాంధ్ర

భారీగా వర్షాల వల్ల పెరుగుతున్న వరద ఉధృతి

పోలవరం: నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ, రామయ్యపేట గ్రామాల సమీపాన ఉన్న ఆలయాలను వరదనీరు చుట్టుముట్టింది. వరద మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

జాతీయం

రాష్ట్రంలో ఎనిమిది విమానాశ్రయాలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రంలో ఎనిమిది విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు. అనంతపురం, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించనున్నారు. వచ్చే 6 నెలల్లో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తక్కువ…

తెలంగాణ

ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు లక్ష్మణ్‌

హైదరాబాద్‌ : ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని భాజపా సీనియర్‌నేత లక్ష్మణ్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవాలని…

తెలంగాణ

వైకాపాకు ముగ్గురు సీనియర్‌ నేతలు రాజీనామా

నిజామాబాద్‌ : విజయమ్మ పర్యటనకు ముందే నిజామాబాద్‌ జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు  భగ్గుమన్నాయి. మాజీ జడ్పీ ఛైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మోహన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

తెలంగాణ

ఉత్తరాఖండ్‌కు రూ.50 కోట్లు ఆర్థికసహాయం ప్రకటించిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌కు రూ. 50 కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఉత్తరాఖండ్‌కు రూ. 10కోట్లు తక్షణ సహాయం, పునరావాసాల కేంద్రాలకు రూ. 10 కోట్లు సహాయం చేయనున్నారు. యాత్రికుల వసతి కల్పనకు రూ. 40 కోట్లు…

తెలంగాణ

ముగ్గురు అదనపు ఎస్పీలకు పదోన్నతి

హైదరాబాద్‌ : ముగ్గురు అదనపు ఎస్పీలకు నాన్‌కేడర్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఎపీ జెస్‌కో ఎస్సీగా దేవదానం, విజిలెన్స్‌ అండ్‌ ఎస్‌పోర్స్‌మెంట్‌ ఎస్సీగా జగ్గారెడ్డి, సీఐడీ ఎస్పీగా ప్రేమ్‌బాబును నియమిస్తూ…

సీమాంధ్ర

బీసెంట్‌రోడ్డు సమీపంలో అగ్ని ప్రమాదం

విజయవాడ : బీసెంట్‌ రోడ్డు సమీపంలోని ఓ ప్లాస్టిక్‌ వస్తువుల గోదాములో ఈరోజు మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిరమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.