Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

నూనె పరిశ్రమలపై విజిలెన్స్‌ దాడులు

సర్పవరం జంక్షన్‌ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలంలోని రమణయ్యపేట, సూర్యారావుపేట గ్రామాల్లో రెండు నూనె పరిశ్రమలపై విజిలెన్స్‌ అండ్‌ ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న ట్యాంకర్లను నిలుపుదలచేసి రికార్డులను తనిఖీ…

జాతీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

శ్రీనగర్‌,(జనంసాక్షి): శ్రీనగర్‌ పట్టణంలో ఉగ్రవాదుల దారుణానికి తెగబడ్డారు. పోలీసులపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

తెలంగాణ

యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం మురళీధర్‌రావు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ… రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతుంటే ఆర్థిక మంత్రి చిదంబరం బంగారం…

జాతీయం

ఉత్తరాఖండ్‌కు మళ్లీ వర్షాల భయం

డెహ్రాడూన్‌ ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో మళ్లీ రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి వరద బాధితులు ఆందోళన చెందుతున్నాయి. బాధితులను వీలైనంత త్వరగా కాపాడేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తుంది.

సీమాంధ్ర

జలదంకిలో హత్య

నెల్లూరు,(జనంసాక్షి): జలదంకి పెట్రోల్‌ బంకు వద్ద ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగిని హత్య చేశారు. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఉద్యోగి మాధవరావు మృతి చెందాడు. మహిళ ఉద్యోగికి…

తెలంగాణ

జనగాంలో హోటళ్లపై దాడులు

వరంగల్‌: జిల్లాలోని జనగాంలో పలు హోటళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 150 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులపై కేసులు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

జనగాంలో పలు హోటళ్లపై కేసులు నమోదు

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని జనగాం పట్టణంలో పలు హోటళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దాడుల్లో పలు హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న 150 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటళ్లకు అక్రమంగా…

తెలంగాణ

వరంగల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల ఉదారత

వరంగల్‌: వరంగల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు తమ ఉదారతను చాటారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు ఒక్కరోజు వేతనాన్ని సాయంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు రూ. 5 లక్షల చెక్కును కమిషనర్‌ వివేక్‌యాదవ్‌కు ఉద్యోగులు శనివారం అందజేశారు.

తెలంగాణ

గ్యాస్‌ గోదాములపై అధికారుల దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలిండర్ల గోదాములపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మూసపేట. సనత్‌నగర్‌ గోదాములలో అక్రమంగా నిల్వ ఉంచిన 103 గ్యాస్‌ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

వరదల్లో చిక్కుకున్న కొందరు తెలుగువారు సురక్షితం

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న కొందరు తెలుగు వారిని సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. విజయవాడకు చెందిన బి. సమారణ్‌, హైదరాబాద్‌కు చెందిన డి. గోపాలకృష్ణ, డి.బి. జానకి, శ్రీనివాసరెడ్డి వరద ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు…