Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సీఎం

హైదరాబాద్‌ : డెహ్రాడూన్‌ యాత్రికులను రాష్ట్రానికి తీసుకువచ్చే యత్నాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రులతో సమీక్షించారు. ఢిల్లీకి పంపిన మంత్రుల బృందం బలరాంనాయక్‌, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌లతో సీఎం మాట్లాడారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని…

సీమాంధ్ర

తిరుమలలో తృటిలో తప్పిన ప్రమాదం

తిరుమల,(జనంసాక్షి): పుణ్యక్షేత్రం రెండో కనుమ రహదారిలో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ బస్సు గోడను ఢీకొని లోయలోకి ఒరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి

సీమాంధ్ర

ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖ : ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రాగల 26 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. దీనికితోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు…

జాతీయం

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో దారుణం

ఒడిశా,(జనంసాక్షి): రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్‌ ఆర్మీ వైద్యుడు తన భార్యను చంపి 300 ముక్కలు చేశాడు. మృతురాలి సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

పాతబస్తీ మెటర్నిటీ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పాతబస్తీ మెటర్నిటీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతునుమిలి తల్లి చంపేసింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరం

డెహ్రాడూన్‌ : రాగల 48గంటల్లో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ దాదాపు 30వేల మందిని రక్షించగా, దాదాపు మరో 50వేల మంది వరకూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.…

జాతీయం

ముంబైలో కూలిన నాలుగంతస్థుల భవనం

ముంబై, (జనంసాక్షి): ముంబైలో నాలుగంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణ

జూబ్లీహిల్స్‌ కార్పోరేట్‌ ఇంట్లో చోరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌ లక్ష్మీబాయి ఇంట్లో గత అర్ధ్రరాత్రి దొంగతనం జరిగింది. రూ. 2 లక్షల విలువైన నగలు, నగదును దొంగలు అపహరించుకొని పోయారు. బాధితురాలు ఉదయం గోల్కొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న…

సీమాంధ్ర

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో దారుణం

దేవరపల్లి : పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో ఈరోజు ఉదయం దారుణం జరిగింది. పోచమ్మ (30)పై ఆమె భర్త రవి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అత్త కళ్లేపల్లి లక్ష్మి (45)పై తీవ్రంగా దాడి చేశారు. ఘటనలో లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందగా,…

జాతీయం

డెహ్రాడూన్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే డెహ్రాడూన్‌ చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.