Thursday, 5 November 2026

June 2013

జాతీయం

ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి అనుమతి

న్యూఢిల్లీ : ధరల నియంత్రణకు బహిరంగ మార్కెట్‌లో 10.5 మిలియన్‌ టన్నుల ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల మంత్రుల సంఘం (సీసీఈఏ) అనుతించింది. నైవేలీ లిగ్నైట్‌లో 5శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సీసీఈఏ ఆమోద ముద్ర వేసింది.

తెలంగాణ

జానారెడ్డితో టీ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డితో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య బసవరాజు సారయ్య. డిప్యూటీ స్పీకర్‌ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఢిల్లీలో జరిగే పరిణామాలు. నిజాం కళాశాల సభ ఏర్పాట్లపై చర్చించినట్లు…

సీమాంధ్ర

మట్టి పెళ్లలు విరిగిపడి ముగ్గురి మృతి

అనంతపురం (ఓబులదేవర చెరువు): అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు మండలం గాజుకుంటపల్లిలో విషాదం నెలకొంది. సోమావతి నదిలో ఇసుక తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి గాజుకుంటపల్లికి చెందిన సూర్యనారాయణ, నవీన్‌, చిరిష్‌లు అక్కడికక్కడే మృతిచెందారు.

తెలంగాణ

నాంపల్లి కోర్టుకు హాజరైన సబిత ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): దాల్మియా సిమెంట్స్‌ కేసులో హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన వారు కూడా కోర్టుకు వచ్చారు. సబిత దాఖలు చేసిన…

సీమాంధ్ర

పశ్చిమగోదావరి జిల్లా యాత్రికులు సురక్షితం

ఏలూరు : చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన 226 మంది పశ్చిమగోదావరి జిల్లా యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు వారి బంధువులకు సమాచారమందింది. వీరంతా తిరుగు ప్రయాణంలో ఉన్నారని తెలిసింది.

తెలంగాణ

మీడియాపాయింట్‌ వద్ద వామపక్షాల నిరసన

హైదరాబాద్‌ : శాసనసభను సజావుగా నడపడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సీపీఐ, సీపీఎం శాసనసభ్యులు అసెంబ్లీ అవరణలోని మీడియాపాయింట్‌ వద్ద నేలపై కూర్చుకుని నిరసన తెలిపారు.

తెలంగాణ

బీజేపీ నాయకుడు ఖాజన్నగౌడ్‌ హత్య

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): జిల్లాలోని కొందుర్గుకు చెందిన బీజేపీ గీత కార్మిక సంఘం నాయకుడు ఖాజన్న గౌడ్‌(38) దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కొందర్గు మండలం ఉత్తరాసిపల్లి సమీపంలో అడ్డగించారు. టాటా సుమో వాహనంపై…

Featured News

తెలంగాణపై సీమాంధ్ర పార్టీల దొంగాట

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర పార్టీలు దొంగాట ఆడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ అత్యున్నత సమావేశం మహానాడులో తీర్మానం చేశామని, కేంద్రానికి లేఖ ఇచ్చామని చెప్తూ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది…

తెలంగాణ

జయశంకర్‌కు తెదేపా తెలంగాణ ఫోరం నివాళి

హైదరాబాద్‌ : తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు గస్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషిని వారు ఈ సందర్భంగా…

సీమాంధ్ర

పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం

గుంటూరు,(జనంసాక్షి): గుర్తు తెలియని వ్యక్తులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక పాత మార్కెట్‌ సెంటర్‌లో ఉన్న శ్రీరాములు విగ్రహం తల,మెడ భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు.…