Thursday, 5 November 2026

July 2013

కరీంనగర్

భోజనం వికటించి 11 విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): మధ్యాహ్నం భోజనం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మల్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు…

జాతీయం

పౌర విమానాయ సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గ ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పౌర విమానయాన సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఐటీడీసీ, స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాయ్‌బరేలిలో రాజీవ్‌గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని మనీష్‌ తివారీ తెలిపారు.

సీమాంధ్ర

ఒంగోలులో రూ.4లక్షలు అపహరించిన దుండగులు

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్రాబ్యాంకు వద్ద ఓ వ్యక్తి వద్ద నుంచి దుండగులు రూ. 4లక్షలు అపహరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలంగాణ

విదేశీ ఉద్యోగాల పేరుతో నగదు స్వాధీనం చేకున్నఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న ఇద్దర్ని గురువారం సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 12లక్షల నగదు, 17 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

జాతీయం

తొలి తీర్పును 25కి వాయిదా వేసిన న్యాయస్థానం

ఢిల్లీ: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు వెలువడుతుందని భావించిన తొలి తీర్పును జువెనైల్‌ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. నిర్భయ కేసులో అరుగురు నిందితుల్లో ఒకడైన బాలనేరస్థుడి విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వులో ఉంచిన…

తెలంగాణ

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

వరంగల్‌,(జనంసాక్షి): పెద్దలు పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో చోటు చేసుకుంది. ప్రేమజంట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రేమజంట పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షేన్‌ వార్న్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌కి ఐసీసీ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. జులై 19న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య రెండో యాషెన్‌ టెస్ట్‌ మ్యాచ్‌  విరామసమయంలో వార్న్‌ని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చుకుంటామని ఐసీసీ గురువారం ప్రకటించింది.…

జాతీయం

కేవీపీ ఇంట్లో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం టీజీ వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను కోర్‌ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్ర విభజన నిర్ణయం ఉంటుందని…

తెలంగాణ

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ ఇవాళ సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

జాతీయం

కేవీపీ నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు, నాయకులు సమావేశ మయ్యారు. కాసేపట్లో వీరంతా దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు.