Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

మాతృభాషలో విద్యకై సుప్రీంలో పిల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విచారణ కొనసాగనుంది.

జాతీయం

అజిత్‌సింగ్‌తో ఐకాస నేతల భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ను తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు ఇవాళ ఢిల్లీలో కలిశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును మద్దతివ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు…

తెలంగాణ

హాల్‌టికెట్ల కోసం మహాత్మగాంధీ యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు

నల్లొండ: నల్గొండ జిల్లా నార్కేట్‌పల్లిలో బీఎడ్‌ వార్షిక పరీక్షలకు హాల్‌ టికెట్లు రాలేదని మహాత్మగాంధీ యునివర్శిటీ వద్ద విద్యార్థులు అందోళనకు దిగారు. అనుమతి లేకుండానే నార్కేట్‌పల్లి బీఎడ్‌ కళాశాల యాజమాన్యం ప్రవేశాలు నిర్వహించిందని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయం

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ పునఃప్రారంభం

వాషింగ్టస్‌: అమెరికా ప్రతిష్ఠాత్మక చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని పర్యాటకుల సందర్శనకు అనుమతిచ్చారు. శాండీ తుపాను సంభవించిన అనంతరం పర్యాటకులను అనుమతించడం ఇదే మొదటిసారి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు, చరిత్రకు చిహ్నమైన స్టాచ్యూ…

జాతీయం

ఉచిత హామీలపై మార్గదర్శకాలు రూపొందించాలి:సదాశివం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు,తాయిలాలు అవినీతి కిందకు రావని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సదాశివన్‌ శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై మార్గదర్శకాలు రూపొందించాలని సదిశివం…

సీమాంధ్ర

దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన గంటి ప్రసాద్‌

నెల్లూరు: ప్రభుత్వమే గంటి ప్రసాదంను హత్య చేయించిందని అయన భార్య కామేశ్వరమ్మ అరోపించారు. గురువారం దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటి ప్రసాదం మృతి చెందిన విషయం విదితమే. ఈ ఉదయం గంటి…

సీమాంధ్ర

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన

అనంతపురం: అనంతపురం జిల్లా పామిడి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట పొగరూరు గ్రామస్థులు బైఠాయించారు. శ్మశాసనవాటకకు కొలతలు వేయడంలో అధికారులు విఫలమయ్యారని, అందుకే కార్యాలయం ఎదుట అందోళన చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.

సీమాంధ్ర

గుంటూరులో కలకలం రేపిన బాంబు

గుంటూరు: నగరంలోని స్వామి థియేటర్‌లో బాంబు ఉన్నట్లు అగంతుకుల నుంచి థియేటర్‌ యాజమాన్యానికి పోన్‌కాల్‌ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచార మందించారు. బాంబ్‌స్వ్కాడ్‌ బృందం ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టింది.

తెలంగాణ

ఎనిమిదవ సీఎల్పీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎల్పీ కార్యవర్గ సమావేశం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సీఎల్పీ సహాయాన్ని ప్రకటించింది.

జాతీయం

మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు అదేశం

ఢిల్లీ : ఎన్నికల ప్రణాళికల్లో హామీల అమలుపై మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం రాజకీయ పార్టీల ఉచిత హామీలను అవినీతిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వసతి…