Wednesday, 4 November 2026

July 2013

సీమాంధ్ర

స్కూల్‌ బస్సు లారీ ఢీ కొని 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఒంగోలు,(జనంసాక్షి): ప్రకాశం జిల్లాలోని జరుగుమిల్లి మండలం కలికివాయి బిట్రగుంట జాతీయ రహదారిపై శుక్రవారం స్కూల్‌ బస్సు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అదే జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి…

సీమాంధ్ర

వినాయకం కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు

చిత్తూరు: పూతలపట్టు మండలం చిన్నబండపల్లిలో వినాయకం కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. వినాయకం కుటుంబ సభ్యులకు చంద్రబాబు రూ. 5లక్షలు అర్థికసాయం అందజేశారు. ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆర్మీ జవాను వినాయకం మృతిచెందిన విషయం తెలిసిందే.

జాతీయం

భివాండీ ప్రమాదంలో ఆరుకు చేరిన మృతులు

ముంబయి: ముంబయిలోని భివాండీలో రెండంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. శిథిలాల కింద గురువారం రాత్రి రెండు మృత దేహాలను, ఈరోజు ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో కర్మాగారం కార్మికులు…

సీమాంధ్ర

నేటి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం రద్దు

తిరుమల,(జనంసాక్షి): పరిపాలన కారణాల దృష్ట్యా నేడు జరగాల్సిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం రద్దు చేసినటుల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే శనివారం జరగనున్న సహస్రకలశాభిషేకం కూడా రద్దు అయిందని తెలిపింది.…

తెలంగాణ

తెలంగాణ భవన్‌లో కేకే, కడియం శ్రీహరి సమీక్ష

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ పటిష్ఠతపై తెలంగాణ భవన్‌లో తెరాస నేతలు కె. కేశవరావు, కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల ఇన్‌ఛార్జులు, అధ్యక్షులు సమీక్షలో పాల్గొన్నారు.

జాతీయం

ఆహార భద్రత ఆర్డినెన్సుకు ఆమోదించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు ఆహార భద్రత బిల్లును ఆమోదించారు. ఆహార భద్రత బిల్లును అర్డినెన్సుగా తీసుకురావడానికి కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆరు వారాల్లోగా…. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలు బిల్లును…

జాతీయం

దిగ్విజయ్‌తో సమావేశమైన లగడపాటి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ సూచించారు. శుక్రవారం దిగ్విజయ్‌సింగ్‌తో లగడసాటి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. గత ఆదివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ వ్యక్తిగత కార్యక్రమంలో…

సీమాంధ్ర

పంచాయతీ ఎన్నికల్లో తెదేపాదే విజయం: ప్రభాకర్‌

తిరుపతి: పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత ప్రభాకర్‌ అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మూడో ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ…

అంతర్జాతీయం

మరింత క్షీణించిన మండేలా ఆరోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా ఉద్యమనేత నెల్సన్‌ మండేలా అరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. మండేలా బ్రెయిన్‌ డెడ్‌ స్థితికి చేరినట్లు సమాచారం.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌ వూపందుకున్న పునరావాస కార్యక్రమాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వూపందుకున్నాయి. యాత్రికులను అదుకునేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని జాతీయవిపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇళ్లు కోల్పోయి నివాసం లేని వారి కోసం నెలకు రూ. 1500 చొప్పున…