Wednesday, 4 November 2026

July 2013

ఖమ్మం

ఇనుపమోరివాగులో లభ్యమైన మహిళ శవం

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని ఇనుపమోరివాగులో గుర్తు తెలియని మహిళ శవాన్ని ఉదయం గుర్తించారు. వరదనీటిలో మృతదేహం కొట్టుకువచ్చింది. అనుమానిస్తున్నారు. మహిళ ముఖం పూర్తిగా చిధ్రమై గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

తెలంగాణ

లారీ ఢీ: సైక్లిస్టు మృతి

టేకులపల్లి (ఖమ్మం): టేకులపల్లి బోడు అడ్డరోడ్డులో ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తున్న బొగ్గులారీ ఢీ కొని సైకిల్‌పై వెళుతున్న జాలాది వెంకయ్య(65) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. జలాది వెంకయ్య స్వస్థలం టేకులపల్లి…

ఎడిట్ పేజీ

పాలకుల దుర్మార్గానికి వేల ప్రాణాలు బలి

ఉత్తరాఖండ్‌ జూన్‌ రెండవ వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల గంగ ఉప నదులైన భాగీరథి, అలకనంద, మందాకిని వంటి నదులకు పెద్దఎత్తున వరుదలు వచ్చాయి. కొండచరియలు విరిగిప డ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు వరదకు కిందికి దొర్లుతూ…

సీమాంధ్ర

తిరుపతిలో చంద్రబాబుకు ఘన స్వాగతం

తిరుపతి: పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గురువారం విజయవాడలో రెండో ప్రాంతీయ సదస్సు ముగించుకొని…

ఎడిట్ పేజీ

సహృదయ స్వచ్చంద సేవకుడు ఆర్‌.ఎస్‌

ఆయనొక నిస్వార్థ సేవా పారాయుణుడు ఆయనొక సామాజిక కార్యకర్త ఆయనొక సాహితీ ప్రియడు ఆయనొక విశ్లేషకుడు ఆ ప్రాంతంలో ఆయనొక సుపరిచితుడు తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుద పోరాటంలో విప్లవ కిశోరాలను గన్న వీరభూమి పాలకుర్తి…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న ఆర్‌.బి.ఐ గవర్నర్‌

తిరుమల: ఆర్‌.బి.ఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన గురువారం రాత్రి తిరుమల చేరుకున్న దువ్వూరి ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

ఎడిట్ పేజీ

గ్రామాలే ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు

రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 2006 గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీల పాలకవర్గాల గడువు 2011 ఆగస్టుతో ముగియగా అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం…

జాతీయం

జింబాబ్వే పర్యటనకు భారతజట్టు ఎంపిక నేడు

ముంబయి: ఈ నెల 24న జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ద్వైపాక్షిక సిరీస్‌ కోసం జాతీయ సెలక్టర్లు ఈరోజు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. జట్టు ఎంపిక చేయడానికి సెలక్షన్‌ కమిటీ ఈరోజు సమావేశం కానుందని…

తెలంగాణ

ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు

గోదావరిఖని పట్టణం: మూడు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులు తొలగింపు యత్నాలను మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ జిల్లా రామగుండం నగర పాలక సంస్థ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అందోళనలో భాగంగా…