Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన

తిరుపతి: ఎస్వీయూలో పలు విభాగాలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విశ్వవిద్యాలయానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు.

తెలంగాణ

మోపిదేవి బెయిల్‌పై విచారణ 31 కి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఈ నెల మళ్లీ విచారణ జరుపుతానని ప్రకటించారు.

జాతీయం

చైనాలో భూకంపం: 47కు పెరిగిన మృతుల సంఖ్య

బీజింగ్‌: వాయువ్య చైనాలోని గన్సు ప్రాంతంలో సోమవారం ఉదయం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 47కు చేరింది. రిక్టర్‌స్కేల్‌పై 6.6తీవ్రత నమోదైన ఈ భూకంపం మింగ్లియాన్‌, జాంగ్లియాన్‌ కౌంటీలలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భూప్రకంపనల ధాటికి మింగ్జియన్‌ కౌంటీలో…

తెలంగాణ

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇండియన్‌ బాడ్మింటన్‌ లీగ్‌ను వేలం వేశారు. బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు భారీ ధర పలికారు. మలేషియా షట్లర్‌ లీచాంగ్‌ ఏకంగా రూ. 77 లక్షల ధరకు అమ్ముడుపోయారు. ముంబై మాస్టర్స్‌ జట్టు ఈమనే సొంతం చేసుకుంది. సైనా నెహ్వాల్‌…

జాతీయం

యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం

రాజమండ్రి : ఓ యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అమ్మవారి గుడివద్ద యువతిని ఆటోడ్రైవర్లు వదిలి వెళ్లారు.

జాతీయం

హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ తరపున ఆడనున్న సైనా రూ. 71.3 లక్షలకు కొనుగోలు

న్యూఢిల్లీ: ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ వేలం ఢిల్లీలో జరుగుతోంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ను రూ. 71.3 లక్షలకు హైదరాబాద్‌ హాట్‌ షాట్స్‌ జట్టు కొనుగోలు చేసింది. మలేషియా షట్లర్‌ లీ చాంగ్‌వీని రూ. 80.2 లక్షలకు ముంబయి…

తెలంగాణ

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.

తెలంగాణ

రిమాండ్‌ ఖైదీ మృతి…. బంధువుల ఆందోళన

వరంగల్‌: జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీ రాములు మృతి చెందాడు. ఖైదీని జైలు అధికారులే హత్య చేశారంటూ ఆరోపిస్తూ బంధువులు జైలు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుండెపోటుతోనే రాములు…

సీమాంధ్ర

జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు

ఐ. పోలవరం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలను  వరద అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న నీటి ప్రవాహంతో లంక గ్రామాల వాసుల బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి…

జాతీయం

నవంబర్‌లోగా తెలంగాణ ఏర్పాటు కావాలి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): నవంబర్‌ నెలలోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫెఢరేషన్‌ ఫర్‌ న్యూ స్టేట్‌ ఇండియీ డిమాండ్‌ చేసింది. లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థను అడ్డుకుంటామని పేర్కొంది. కాంగ్రెస్‌పార్టీ ఇప్పటికైనా నిర్మాణాత్మక…