Thursday, 5 November 2026

July 2013

జాతీయం

ఇరాక్‌లో 25 మంది భద్రతా సిబ్బంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లోని జైళ్లమీద ఆందోళనకారులు దాడులు జరిపారు. తాజి, అబుగ్రాయిబ్‌ జైళ్లపై లిమిటెంట్లు దాడులు చేయగా 25 మంది భద్రతా సిబ్బంది. పదిమంది మిలిటెంట్లు మృతిచెందారు. ఆదివారం రాత్రినుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అంతర్జాతీయం

కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన కేట్‌ మిడిల్‌టన్‌

లండన్‌: బ్రిటన్‌ రాకుమారుడు విలియం భార్య కేట్‌ మిడిల్‌టన్‌ సోమవారం ఆస్పత్రిలో చేరారని, విలియం కూడా ఇదే ఆస్పత్రిలో పుట్టారని బ్రిటన్‌ రాజ కుటుంబ వర్గాలు తెలిపాయి. కాన్పు సమయంలో ఎవరెవరు ఆమె పక్కన ఉండాలి, వైద్య సిబ్బంది…

తెలంగాణ

హుస్సేన్‌సాగర్‌కు ముప్పులేదు: కమిషనర్‌ కృష్ణబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌కు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ నిండిపోయిందని, ఏక్షణంలోనైనా అది పొంగి ప్రవహించి, దిగువనున్న అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, ఇందిరాపార్కు, దోమలగూడ లాంటి ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని గత…

తెలంగాణ

అసెంబ్లీ కంప్యూటరీకణకు కేంద్రం గుర్తింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర శాసన సభను కంప్యూటరీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఇవాళ స్వీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. శాసనసభకు గ్రాంట్‌గా రూ. 1.6 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆయన అన్నారు. దీన్ని మిషన్‌మోడ్‌…

తెలంగాణ

అవనిగడ్డ టీడీపీ అభ్యర్థిగా అంబటి హరిబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్‌(హరిబాబు) పేరును  టీడీపీ ఖరారు చేసింది. అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు ఈ ఉదయం …

అంతర్జాతీయం

యానాం వరద పరిస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావన

యానాం: గత మూడు రోజులుగా యానాం నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు వరద నీటిలలో ముంపునకు గురైనా పుదుచ్చేరి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిపై యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అసెంబ్లీలో ప్రస్తావించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశం శూన్యగంటలో యానాంలో…

తెలంగాణ

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంగళవారం జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. వెబ్‌ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తామని. పోటీలో ఉన్న అభ్యర్థులు  మరణిస్తే ఎన్నికలు…

తెలంగాణ

వరదల వల్ల మృతిచెందినవారికి రూ. 2లక్షల పరిహారం

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల సహాయకచర్యల ఏర్పాట్లపై మంత్రి రఘువీరారెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. వరదల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారని మంత్రి తెలిపారు. వరదల వల్ల మృతి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం చెల్లించనున్నట్లు మంత్రి…

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ నేత కేకే గురు పౌర్ణమి పూజలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు గురుపౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని సాయిబాబా ఆలయంలో ఇవాళ ఆయన పూజలు చేశారు. ఆయనతోపాటు కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీ పద్మారావు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ

హస్తిన వెళ్లనున్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తినబాట పట్టనున్నారు. కాసేపట్లో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఆయన సీడబ్య్లూసీ సభ్యులను కలిసి తెలంగాణ అంశంపై మాట్లాడనున్నారు.