మయన్మార్‌లో స్వల్ప భూకంపం
మయన్మార్,(జనంసాక్షి): మయన్మార్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.7 గా నమోదైంది.
మయన్మార్,(జనంసాక్షి): మయన్మార్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.7 గా నమోదైంది.
లక్నో,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువతిని నడిరోడ్డుపై సజీవ దహనం చేశారు. బిజనూర్ జిల్లా ముద్దూరులో ఈ దారుణ ఘటన జరిగింది. అయిదారుగురు దుండగులు నడిరోడ్డుపై యువతిని సజీవదహనం చేసి పారిపోయారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన ఉత్తమ్‌సింగ్‌కు గుండెనొప్పి వచ్చింది. దీంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి ఉత్తమ్‌సింగ్‌ను అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉత్తమ్‌సింగ్ మృతిచెందారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికే తన మద్దతని శివసేన నేత ఉద్దవ్ థాకరే ప్రకటించారు. మోడి అభ్యర్థిగా తాను ఇంతవరకు వ్యతిరేకించలేదని చెప్పారు. తమ తండ్రి బాలథాకరే సుష్మాస్వరాజ్ ప్రధానిని చేయాలన్నది వాస్తవమేనన్నారు. అప్పుడు…
హైదరాబాద్,(జనంసాక్షి): బంజారాహిల్స్‌లోని నిబంధనలకు విరుద్దంగా మైనర్లకు నిషేధిత పదార్థాలను సరఫరా చేస్తున్న హుక్కా సెంటర్లపై డీసీపీ వెష్ట్‌జోన్ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో హుక్కా సేవిస్తున్న మైనర్లను పోలీసులు పట్టుకున్నారు.
సికింద్రాబాద్,(జనంసాక్షి): అమెరికన్ కాన్సులేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి వద్ద ఒక తుపాకీ, నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రత్తిపాడు,(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీసులు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు మండలం బొర్రవారిపాలెంలో చెక్‌పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీ చేస్తుండగా వాహనంలో తరలిస్తున్న రూ.50 లక్షలు పట్టుకున్నారు. ఈ డబ్బును…
హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొంటారు. అనంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కలువనున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని అమెరికా కాన్స్‌లేట్ వద్ద టాన్స్‌ఫెర్స్ తనిఖీల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రివాల్వర్, 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె బాట పట్టిన 108 ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 108 సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు ర్యాలీలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.…