Tuesday, 3 November 2026

August 2013

Featured News

తెలంగాణపై నిర్ణయమైపోయింది

సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే మీ డిమాండ్లు కమిటీకి చెప్పండి ఏపీఎన్‌జీవోలు, విజయమ్మతో ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణ యం జరిగిపోయిందని ప్రధాని మ న్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు.…

Featured News

విభజన తర్వాత సీమాంధ్ర సమస్యల పరిష్కారం

అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాకే కాంగ్రెస్‌ నిర్ణయం ఇప్పుడు వైకాపా మాటలకు విలువలేదు : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి…

Featured News

మానవీయ విలువలతో వైద్యం చేయండి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : మనదేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువ ఉన్నారని ఈ పరిస్థితిని యువ వైద్యులే మార్చాలని బారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం…

Featured News

తెలంగాణ తప్ప చిన్న రాష్ట్రాల ప్రతిపాదన లేదు

లోక్‌సభలో కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ మినహా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బోడోలాండ్‌, గూర్ఖాలాండ్‌, విదర్భ, బుందేల్‌ఖండ్‌ వంటి రాష్ట్రాల ఏర్పాటు అంశం పరిశీలనలో…

Featured News

రూపాయి ఢమాల్‌

చింతించొద్దు.. కోలుకుంటుంది : చిదంబరం ముంబయి, ఆగస్టు 27 (జనంసాక్షి) భారత అధికారిక ద్రవ్యం రూపా యి బావురుమంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం ఒక్కరోజే రెండు రూపా యలకు పైగా క్షీణించి 66 రూపాయల దిగువకు…

Cover Story

సెప్టెంబర్‌ 1 నుంచి ముల్కీ అమరుల వారోత్సవాలు

7న శాంతిర్యాలీ సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ ప్రక్రియ వేగవంతం చేయకపోతే అనర్థాలు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని తెలంగాణ పొలిటికల్‌…

జాతీయం

పెరిగిన పసిడి ధరలు

ముంబై,(జనంసాక్షి): పుత్తడి మళ్లీ కాంతులీనుతుంది. ఇవాళ పది బంగారం ధర రూ. 32,000 లకు చేరింది. రూపాయి క్షీణత, స్టాక్‌ మార్కెట్ల పతనం బంగారం ధరను  ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రూపాయి…

తెలంగాణ

కోర్టుకు గోకుల్‌ చాట్‌ పేలుళ్ల నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కుల వద్ద జరిగిన పేలుళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో ప్రవేశ పెట్టారు. సఫీక్‌,అక్బర్‌, షారుఖ్‌, సాదియాలను మహారాష్ట్ర పోలీసులు ఇవాళ కోర్టుకు తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

కరీంనగర్

ఏసీబీ వలలో చిక్కిన కొడిమ్యాల వీఆర్వో

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలోని కొడిమ్యాల మండలం తిరుమాలాపూర్‌లో వీఆర్వో ఎస్‌. శ్రీనివాస్‌ రైతు నుంచి రూ. వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోపై కేసు నమోదు చేశారు.

తెలంగాణ

‘మీరు దోచుకుపోతుంటే మేం చూస్తూ కూర్చోవాలా’? : నాగం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం కిరణ్‌ హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో మా కార్యాలయాలకు వెళ్లాలంటే…