Tuesday, 3 November 2026

August 2013

Cover Story

సీఎం, డీజీపీలే సమైక్య ఉద్యమం నడుపుతుండ్రు

హరీశ్‌, ఈటెల ఫైర్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వెనుకుండి సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. సీమాంధ్ర జేఏసీకి…

తెలంగాణ

హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణ ప్రజల హక్కు :జూపల్లి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముమ్మాటికీ హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కోసం శాంతి ర్యాలీ తీస్తే టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్‌, స్వామిగౌడ్‌ బాల్కసుమన్‌ అరెస్టు చేయడం దారుణమన్నారు.…

జాతీయం

పార్లమెంట్‌ సమావేశాలు పొడిగింపు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలను పొడిగించారు. ప్రస్తుతం సమావేశాలను సెప్టెంబర్‌ 6 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ

ఉధ్రిక్తంగా మారిన ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ప్రాంగణం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ ప్రభావం నగరంలోని అన్ని కమిషనరేట్‌లను అట్టుడికిస్తుంది. ఇవాళ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్రా ఉద్యోగులు ధర్నాకు దిగారు. తెలంగాణ ఉద్యోగులు జైతెలంగాణ నినాదాలు చేస్తూ కార్యాలయం…

తెలంగాణ

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అధికారిపై దాడికి నిరసనగా తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. అధికారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌సౌధలోని తెలంగాణ ఉద్యోగులు తమ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి…

జాతీయం

రాష్ట్ర విభజన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. విభజనపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయనందున పిటిషన్‌ విచారణర్హం…

తెలంగాణ

ఇందిరాపార్కు వద్ద బీజేపీ బీసీ మహాదీక్ష ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ బీసీ మహాదీక్ష చేపట్టింది. దీక్షను ఇందిరాపార్కు వద్ద బీజేపీ నేతలు ప్రారంభించారు. దీక్షలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, విద్యాసాగర్‌ రావు, యెండల…

జాతీయం

రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. వీహెచ్‌పీ యాత్రపై ఎస్పీ, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగుతుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ అన్సారీ ప్రకటించారు.

జాతీయం

నిందితులను వీలైనంత త్వరగా శిక్షిస్తాం : షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబయి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి వీలైనంత త్వరగా నిందితులకు శిక్షపడేలా చూస్తామని కేంద్ర హోం మంత్రి షిండే అన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ 20 బృందాలతో గాలించి ముంబయి పోలీసులు నిందితులను…

తెలంగాణ

ఉద్యోగ సంఘాలకు మెమో జారీ చేసిన సీఎస్‌ మహంతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మెమో జారీ చేశారు. సచివాలయంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని సీఎస్‌ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని సీఎస్‌ హెచ్చరించారు.