Thursday, 5 November 2026

August 2013

తెలంగాణ

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై స్పందించిన హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఏర్పడుతున్న ఆటంకాలపై హైకోర్టు స్పందించింది. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఏ కౌన్పెలింగ్‌ కేంద్రంలోనైనా విద్యార్థులు హాజరుకావచ్చని సూచించింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను కోర్టు కూడా పర్యవేక్షిస్తుందని హైకోర్టు తెలిపింది.

జాతీయం

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అడ్డుకోవద్దు: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అడ్డుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అందరి అభిప్రాయాలను ఆంటోని కమిటీ సావధానంగా వింటుందన్నారు.

జాతీయం

దిగ్విజయ్‌తో భేటీ అయిన కేవీపీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచద్రరావు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై దిగ్విజయ్‌తో కేవీపీ చర్చించినట్లు సమాచారం.

జాతీయం

తెలంగాణపై మరోమాట లేదు: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై మరోమాట లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఆటంకం కలిగించొద్దని సీమాంధ్రులకు హితవు పలికారు.…

తెలంగాణ

రాఖీ కట్టిన మహిళలకు ఉల్లిగడ్డలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రక్షాబంధన్‌ వేడుకలకు ఆ పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాఖీ కట్టిన మహిళలకు ఆయన ఉల్లిగడ్డలను బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో భాతర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఈ…

తెలంగాణ

ఏపీఎన్టీవోలపై హైకోర్టు సీరియస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చట్ట విరుద్దంగా సమ్మె చేస్తున్నారంటూ ఏపీఎన్టీవోపై హైకోర్టు సీరియస్‌ అయింది. రవికుమార్‌ అనే న్యాయవాది ఏపీఎన్టీవోల సమ్మె రాజ్యంగ విరుద్దమని హైకోర్టులో వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఏపీఎన్టీవోలు ప్రభుత్వ ఉద్యోగులా, ప్రైవేటు ఉద్యోగులా…

జాతీయం

సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

ఘనంగా శివలింగార్చన పూజలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలో గోశాలలోని లక్ష్మీనారాయణ మందిరం పూజారి గోపాల్‌దాస్‌ ఆధ్వర్యంలో నెలరోజులపాటు గోదావరి మట్టితో తయారు చేసిన లింగాలను తయారు చేసి వాటిని రోజుకో ఆకారంలో పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అర్ధనారీశ్వరీ ఆకారంలో…

తెలంగాణ

కోటి రూపాయల బంగారు కడ్డీ స్వాధీనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాత బస్తీకి చెందిన రషీద్‌ అనే వ్యక్తి నుంచి రూ.కోటి విలువైన బంగారు కడ్డీని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం.

తెలంగాణ

మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి:) శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖ చేపట్టిన మనగుడి కార్యక్రమాన్ని ఈవో ఎంజీ గోపాల్‌ తిరుపతిలో ప్రారంభించారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాలలోని ఆలయంలో రక్షాకంకణాలకు పూజ నిర్వహించి విద్యార్థులకు కంకణాలు పంపిణీ…