Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

సచివాలయంలో తెలంగాణ బోనాల సందడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ బోనాలతో సందడి నెలకొంది. సచివాలయ ప్రాంతంలో ఉన్న నల్లపోచమ్మకు తెలంగాణ ఉద్యోగులు బోనాలు సమర్పించారు. మరో పక్క ఎల్‌బ్లాక్‌ ముందు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

తెలంగాణ

డీజీపీ సమైక్యవాద పక్షపాతి: జూపల్లి

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ దినేష్‌రెడ్డి సమైక్యావాద పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం డీజీపీని సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రస్‌ నేతలు చేసింది ఏమీ లేదని…

జాతీయం

మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన ఉభయసభలు

ఢిల్లీ,(జనంసాక్షి): 12:30 గంటలకు సమావేశమైన రాజ్యసభలో రక్షణ మంత్రి ఆంటోని పూంచ్‌ సెక్టార్‌లో కాల్పుల ఘటనపై ప్రకటన చేశారు. సభ వెంటనే మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా పడింది. లోక్‌సభ కూడా మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా పడింది.

తెలంగాణ

సీఎం కిరణ్‌తో సీఎస్‌, డీజీపీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం సీమాంధ్రలో నెలకొన్న ఆందోళనలు, జాతీయ నాయకుల విగ్రహాల ధ్వంసంపై వీరు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

విగ్రహాల ధ్వంసాన్ని ఖండించిన గీతారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమైక్య ఉద్యమం పేరుతో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ఖండించారు. అన్ని వర్గాల సంప్రదింపుల తర్వాతనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు గీతారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన విషయం…

జాతీయం

సోనియాతో భేటీ అయిన శంకర్‌రావు

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ మంత్రి శంకర్‌రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

జాతీయం

రాజ్యసభ అరగంట వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ నేతలు సభను అడ్డుకోవడంతో రాజ్యసభ ఛైర్మన్‌ సభను 12:30 వరకు వాయిదా వేశారు.

జాతీయం

సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

రాయ్‌పూర్‌,(జనంసాక్షి): రాయ్‌పూర్‌లోని స్టాఫ్‌ క్వర్టర్స్‌ ఆఫ్‌ పార్లమెంటరీ ఫోర్సెస్‌లో తుపాకీతో కాల్చుకుని ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. 65 బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఏఎస్‌రాయుడు తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ వికాస్‌…

తెలంగాణ

రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు: డీజీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు మీడియా   సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లకు అడ్డుపడినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సీమాంధ్రలో రైల్‌రోకోలపై పునరాలోచించుకోవాలని ఆయన…

జాతీయం

మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభభమైన పది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సమైక్యాంధ్ర నినాదాలతో సమావేశం మొదలవుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ నేతల తీరును భాజపా సభ్యులు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ సభ్యుల వ్యవహారధోరణికి నిరసనగా భాజపా…