Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

ప్రభుత్వ లాంఛనాలతో ప్రేమ్‌నాథ్‌ సింగ్‌ అంత్యక్రియలు

పాట్నా,(జనంసాక్షి): పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీహార్‌ రెజిమెంట్‌ సైనికుడు ప్రేమ్‌నాథ్‌సింగ్‌ అంత్యక్రియలు గురువారం బీహార్‌లోని ఆయన స్వగ్రామం సమౌతాలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బంధువులు, వందలాది ప్రజలు ప్రేమ్‌నాథ్‌కు ఘన నివాళి అర్పించారు.

జాతీయం

12 పైసలు బలపడిన రూపాయి

ముంబయి,(జనంసాక్షి): గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి శుక్రవారం కొద్దిగా పుంజుకుంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్చేంజ్‌ ఆరంభ ట్రేడింగ్‌లో వ్యాపారులు, బ్యాంకులు డాలర్‌ అమ్మకాలు చేయడంతో రూపాయి 12 పైసలు బలపడింది.

జాతీయం

ప్రారంభమయిన పార్లమెంట్‌ ఉభయ సభలు

ఢిల్లీ,(జనంసాక్షి): నాలుగో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రశ్నోత్తరాల సమయం లోక్‌సభలో కొనసాగుతుంది.

జాతీయం

సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయవతికి సుప్రీకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోలాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోరుట కొట్టేసింది.

తెలంగాణ

నేడు సమావేశం కానున్న టీఎంయూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమ్మె అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూపియన్‌ తెలంగాణ విభాగం ఈ రోజు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు యూనియన్‌ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు ఈ సంఘ నేతలు తెలిపారు.

ఆదిలాబాద్

వాయిదా పంచాయితీల్లో పోలింగ్‌ ప్రారంభం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌(యూ) మండలం పంగిడి, భీమిని మండలం లక్ష్మీపూర్‌ పంచాయతీల్లో ఉదయం పోలింగ్‌ ప్రారంభం అయింది. వరదల కారణంగా ఈ పంచాయతీల్లో పోలింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెెక్స్‌ 27 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది.

Featured News

తెలంగాణ ఏర్పాటుకు 12 నుంచి ఆందోళన

ఆంధ్రా డబ్బా ఎన్‌టీవీ చూడొద్దు.. చర్చలకు వెళ్లొద్దు తెలంగాణ టీడీపీ నోరెందుకు మూసుకుంది కాంగ్రెస్‌ నేతలు మాట్లాడాలి ఉదాసీనంగా ఉంటున్న డీజీపీని తప్పించాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,  ఆగస్టు 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం…

Featured News

ప్రాంతాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందాం

మీట్‌ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హిందీ మాట్లాడే వారికి పది రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు వారికి రెండు…

Featured News

అధికారికంగా ఆంటోని కమిటీ

సీమాంధ్రులు కష్టనష్టాలు చెప్పుకోండి ఆందోళనలు విరమించండి రాష్ట్రాల విభజన కష్టమే.. తెలంగాణ నిర్ణయం అయిపోయింది : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రుల అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏకే…